కేరళలో సంపూర్ణ లాక్ డౌన్..

అనుకున్నంతా అయింది, ఒక్క రోజులోనే కేరళలో కేసులు రెట్టింపు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే లాక్ డౌన్ ని ప్రస్తుతం రెండు రోజులకే పరిమితం చేసినా.. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి దీన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈనెల 31, ఆగస్ట్ 1 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం దానికి రివర్స్ […]

Advertisement
Update: 2021-07-29 03:27 GMT

అనుకున్నంతా అయింది, ఒక్క రోజులోనే కేరళలో కేసులు రెట్టింపు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే లాక్ డౌన్ ని ప్రస్తుతం రెండు రోజులకే పరిమితం చేసినా.. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి దీన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈనెల 31, ఆగస్ట్ 1 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం దానికి రివర్స్ లో జరుగుతోంది. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముందుగా మహారాష్ట్ర లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ లోకి వచ్చేశాయి. కేసుల సంఖ్య తగ్గడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ లాక్ సడలింపులు వచ్చేశాయి. కానీ కేరళలో కేసుల సంఖ్య తగ్గకపోవడంతో అక్కడ వారాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ ఒక్క రోజులోనే కేసులు రెట్టింపు కావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేరళపై కేంద్రం ఫోకస్..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం కేరళనుంచే వెలుగులోకి వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిపుణుల బృందాన్ని కేరళకు పంపించింది. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ‌కు నిపుణుల బృందం స‌హ‌క‌రిస్తుంది. కేర‌ళ‌లో ప‌ది శాతం పైగా పాజిటివిటీ రేటు న‌మోద‌వుతున్న 12 జిల్లాల్లో కేంద్ర బృందం ప‌ర్య‌టిస్తుంది. కేరళలో ఆక్సిజన్ నిల్వలపై కూడా కేంద్రం ఆరా తీసింద్. అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News