కోవిడ్ తగ్గిన తర్వాత ఇలా..

కరోనా రాకుండా ఎలా ఉండాలి. వచ్చినప్పుడు ఎలా ఉండాలో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. – కోవిడ్ తగ్గిన తర్వాత ఎలా ఉండాలనే విషయంపై ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. – కరోనా సోకి తగ్గిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, డిస్టెన్సింగ్ పాటించాలి. – […]

Advertisement
Update: 2021-05-21 04:11 GMT

కరోనా రాకుండా ఎలా ఉండాలి. వచ్చినప్పుడు ఎలా ఉండాలో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

– కోవిడ్ తగ్గిన తర్వాత ఎలా ఉండాలనే విషయంపై ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది.
– కరోనా సోకి తగ్గిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, డిస్టెన్సింగ్ పాటించాలి.
– కోవిడ్‌ సమయంలో శరీరంలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయన్నది వ్యక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు మస్ట్.
– తగ్గిన వెంటనే మళ్లీ కోవిడ్ సోకే అవకాశం లేకపోయినా.. ఆ వ్యక్తి ఒక వాహకంగా వైరస్ ను వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు.
– కోవిడ్‌ నుంచి కోలుకున్నాక కనీసం రెండు మూడు నెలల వరకూ వ్యాక్సిన్‌ అవసరం లేదు.
– కోవిడ్ నుంచి కోలుకున్నాక నీరసం, నిస్సత్తువ లాంటివి ఉంటే కొంతకాలం వేచి చూడాలి. రెండు మూడు వారాలు దాటిన తర్వాత కూడా తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించాలి.
– కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా శ్వాస ఇబ్బందులు ఉంటే ఆక్సిజన్‌ స్థాయిలు 95 శాతం కన్నా తగ్గిపోవడం, ఛాతిలో నొప్పి లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
– కోవిడ్‌ వచ్చి తగ్గిపోయిన అందరికీ బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం లేదు. షుగర్ , ఇమ్యూనిటీ సమస్యలున్న కొందరికే అలా జరిగే ప్రమాదం ఎక్కువ.
– కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కానీ ట్యాబ్లెట్స్ వాడకం వీలైనంత త్వరగా ఆపేయడం మంచిది.
– దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలు ఉన్నవారు కోవిడ్ తో వాటి ఇబ్బంది పెరిగితే డాక్టర్ను సంప్రదించి మందులు వాడాలి

Tags:    
Advertisement

Similar News