ఉద్యమాలు చేస్తే దేశద్రోహులా?

రైతు ఉద్యమాలపై కేంద్రం తీరును శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తప్పుపట్టారు. రైతులను కించపరిచేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. రైతు ఉద్యమంపై రాజ్యసభ దద్దరిల్లింది. శుక్రవారం ఆయన రైతు ఉద్యమంపై రాజ్యసభలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే.. వాళ్లను దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్లు దేశద్రోహులైపోతారో? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన […]

Advertisement
Update: 2021-02-05 23:08 GMT

రైతు ఉద్యమాలపై కేంద్రం తీరును శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తప్పుపట్టారు. రైతులను కించపరిచేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. రైతు ఉద్యమంపై రాజ్యసభ దద్దరిల్లింది. శుక్రవారం ఆయన రైతు ఉద్యమంపై రాజ్యసభలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే.. వాళ్లను దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్లు దేశద్రోహులైపోతారో? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులను కేంద్రం దేశద్రోహులంటూ ముద్ర వేస్తున్నదని విమర్శించారు.

రైతుల పట్ల కేంద్రప్రభుత్వం తీరు అమానుషమని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసిందని మండిపడ్డారు.

‘అన్నదాతలూ ఈ దేశ పౌరులే.. ఆ విషయాన్ని కేంద్రం గుర్తించాలి. వాళ్లను శత్రువుల్లా చూడటం ఆపాలి. గణతంత్ర దినోత్సవం నాడు హింస చెలరేగింది. త్రివర్ణ పతాకాన్ని కొందరు అవమానించారు. దీన్ని అన్ని పార్టీలు ఖండించాయి. కానీ బీజేపీ మాత్రం రాజకీయం చేయాలని చూసింది. జాతీయ జెండాను అవమానించిన దీప్​ సిద్దూ ఎందుకు కనిపించకుండా పోయారు. అతడు బీజేపీ మనిషని కూడా ఆరోపణలు వచ్చాయి. దీప్​ సిద్దూను ఇంకా ఎందుకు అరెస్ట్​ చేయడం లేదు. పోలీసులు తలుచుకుంటే అది పెద్ద పనా?’ అంటూ సంజయ్​ రౌత్​ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News