సీఎం మార్పా.. అదంతా వట్టి పుకారే..! రెండున్నరేళ్లు నేనే ఉంటా!

కర్ణాటక సీఎం యడియూరప్పను బీజేపీ హైకమాండ్​ పక్కనపెట్టబోతున్నదని.. ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ అధిష్ఠానం అయితే ఇంత వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ యడియూరప్ప మార్పు ఖాయమని వార్తలు వస్తున్నాయి. అందుకే కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేయడం లేదని.. త్వరలోనే కొత్త వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యడియూరప్ప స్పందించారు. ‘మరో రెండున్నర […]

Advertisement
Update: 2021-01-01 10:19 GMT

కర్ణాటక సీఎం యడియూరప్పను బీజేపీ హైకమాండ్​ పక్కనపెట్టబోతున్నదని.. ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ అధిష్ఠానం అయితే ఇంత వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ యడియూరప్ప మార్పు ఖాయమని వార్తలు వస్తున్నాయి. అందుకే కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ చేయడం లేదని.. త్వరలోనే కొత్త వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యడియూరప్ప స్పందించారు.

‘మరో రెండున్నర ఏళ్లు నేనే సీఎంగా ఉంటాను. కర్ణాటకలో సీఎం మార్పు జరగడం లేదు. అని యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక బీజేపీలో ఎవరికీ అభిప్రాయబేధాలు లేవని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధిష్ఠానానికి తనపై కోపం ఉన్నట్టు వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని ఆయన పేర్కొన్నారు. కొంత మంది తనపై పనిగట్టుకొని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇంచార్జి అరుణ్‌ సింగ్‌ స్వయంగా నాయకత్వ మార్పు అంశంపై స్పష్టత ఇచ్చారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నానని, అయితే కేవలం అభివృద్ధి ఎజెండా కోసం ఈ భేటీ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.

కర్ణాటక బీజేపీలో ముసలం పుట్టిందని.. చాలా మంది బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు యడియూరప్ప వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా రావడంతో సీఎం పీఠం నుంచి తప్పించినున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఎప్పుడూ నోరువిప్పని యడియూరప్ప తాజాగా స్పందించారు.

Tags:    
Advertisement

Similar News