రజనీకాంత్‌ రాకపోవడానికి అసలు కారణం ఇదేనా ?

సూపర్‌ప్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణం ఏంటి? అనే దానిపై చర్చ నడుస్తోంది. అనారోగ్యమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణం ఇటీవల వచ్చిన సర్వే రిపోర్టు అని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తర్వాత జనస్పందన ఎలా ఉంది? పార్టీ పెడితే ఊపు వస్తుందా? ఎన్ని సీట్లు వస్తాయి? అని తెలుసుకునేందుకు రజనీకాంత్‌ ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించారట. 234 సీట్లలో ప్రభావం […]

Advertisement
Update: 2020-12-29 22:05 GMT

సూపర్‌ప్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణం ఏంటి? అనే దానిపై చర్చ నడుస్తోంది. అనారోగ్యమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణం ఇటీవల వచ్చిన సర్వే రిపోర్టు అని తెలుస్తోంది.

రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తర్వాత జనస్పందన ఎలా ఉంది? పార్టీ పెడితే ఊపు వస్తుందా? ఎన్ని సీట్లు వస్తాయి? అని తెలుసుకునేందుకు రజనీకాంత్‌ ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించారట. 234 సీట్లలో ప్రభావం దేవుడెరుగు… కేవలం 15 నుంచి 20 సీట్లలో మాత్రమే రజనీ పార్టీ ప్రభావం ఉంటుందని సర్వే తేల్చిందట.

బీజేపీ మనిషిగా ముద్రపడడం..రెండు సార్లు ఓడిపోయిన డీఎంకే పట్ల సానుభూతి ఉండడం రజనీకాంత్‌కు మైనస్‌గా మారిందని సర్వే నివేదిక సారాంశం. ఈ సర్వేను పూర్తిగా స్టడీ చేసిన కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య… పార్టీ పెట్టొద్దని రజనీకాంత్‌ను కోరారట. దీనికి తోడు 70 ఏళ్ల వయస్సులో టెన్షన్‌లు ఎందుకు… పార్టీ వద్దని చెప్పారట. దీంతో రజనీకాంత్ ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. కరోనా, అనారోగ్యం అనేది కేవలం అభిమానులను శాంతింపజేయడానికి మాత్రమే అని చెబుతున్నారు.

Advertisement

Similar News