కర్నాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య...

దేశ రాజకీయాల్లో ఇది ఓ సంచలనం. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం, దానికి కారణం మండలిలో జరిగిన అవమానమే అనే అనుమానం రావడం మరింత చర్చనీయాంశం అయింది. కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగుళూరు జిల్లా గుణసాగర్ ప్రాంతంలో రైర్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంట్లోనుంచి […]

Advertisement
Update: 2020-12-28 21:52 GMT

దేశ రాజకీయాల్లో ఇది ఓ సంచలనం. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం, దానికి కారణం మండలిలో జరిగిన అవమానమే అనే అనుమానం రావడం మరింత చర్చనీయాంశం అయింది.

కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మె గౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగుళూరు జిల్లా గుణసాగర్ ప్రాంతంలో రైర్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంట్లోనుంచి వెళ్లిపోయారని, గన్ మెన్, పోలీసులు ఆయన కోసం గాలించినా ఫలితం లేదని చెబుతున్నారు. మంగళవారం వేకువ ఝామున 2 గంటల సమయంలో గుణసాగర్ సమీపంలో ధర్మె గౌడ మృతదేహాన్ని పోలీసులు రైల్వే ట్రాక్ పక్కన కనుగొన్నారు. సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

అవమాన భారం భరించలేకేనా..?

డిసెంబర్ 15న కర్నాటక శాసన మండలి సమావేశాల్లో జరిగిన గొడవలో ధర్మెగౌడను కుర్చీలోనుంచి లాగి కిందకు తోసేశారు కాంగ్రెస్ సభ్యులు. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ సభాపతి స్థానంలో ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ధర్మె గౌడను తోసేసి.. కిందకు లాక్కెళ్లారు కాంగ్రెస్ సభ్యులు. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటినుంచీ ధర్మె గౌడ తీవ్ర మనస్థాపంతో ఉన్నారని, ఆయన ఆత్మహత్యకు కారణం ఆ అవమాన భారమేనని అంటున్నారు సన్నిహితులు.

విధాన పరిషత్ గొడవకు కారణం ఏంటి.. ?

కర్నాటక విధానసభలో బీజేపీకి బలం ఉన్నా.. విధాన పరిషత్ లో మాత్రం విపక్షాలకు బలం ఎక్కువ. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. బీజేపీ బలం 31కి పెరిగినా.. అది నిర్ణయాత్మకం కాకపోవడంతో జేడీఎస్ తో కమలదళం సఖ్యత కోరుకుంటోంది. కర్నాటక పరిషత్ లో సభాధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ నేతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు బీజేపీ నేతలు. జేడీఎస్ కి చెందిన డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఓటింగే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సభ్యులు గొడవ చేశారు. డిప్యూటీ చైర్మన్ ధర్మె గౌడను చైర్ లోనుంచి కిందకు లాగి తోసేశారు. అప్పటినుంచి అవమాన భారంతో కుంగిపోయిన ధర్మెగౌడ.. చివరకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Similar News