ధరణిలో మరో సమస్య

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సొంత ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 (సోమవారం) నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాలి. కానీ ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా […]

Advertisement
Update: 2020-11-21 22:38 GMT

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సొంత ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించిన నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 (సోమవారం) నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాలి. కానీ ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 23 నుంచి కచ్చితంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. కానీ దీనికి సంబంధించి హైకోర్టులో కేసు ఒకటి విచారణలో ఉన్నది.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కోర్టులో స్టే ఉండటంతో 23న ఈ ప్రక్రియ ప్రారంభించడం అనుమానమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం కోర్టు విచారణ చేపట్టి తుది తీర్పు ఇవ్వడమో లేదా స్టేను తొలగించడమో జరిగితే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాదు.

అయితే సోమవారం స్టే తొలగించినా అధికారులు ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి మరో నాలుగు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.

Advertisement

Similar News