జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

డిసెంబర్ 1న పోలింగ్.. 4న కౌంటింగ్ జనరల్ మహిళలకు మేయర్ పీఠం రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు… ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు 2021 ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం […]

Advertisement
Update: 2020-11-17 02:15 GMT
  • డిసెంబర్ 1న పోలింగ్.. 4న కౌంటింగ్
  • జనరల్ మహిళలకు మేయర్ పీఠం రిజర్వ్

తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు… ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు 2021 ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.

2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ప్రస్తుత డివిజన్ల రిజర్వేషన్లు ఉండబోతున్నాయి. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది. షెడ్యూల్ విడుదల కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది.

ఇక జీహెచ్ఎంసీ మేయర్‌ పదవిని ఈ సారి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఎస్టీకి 2, ఎస్సీకి 10, బీసీకి 50, జనరల్ మహిళలకు 44, జనరల్‌కు 44 డివిజన్లు కేటాయించారు.

ఎన్నికలు జరిగేది ఇలా…

  • నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
  • నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
  • నవంబర్ 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు.
  • డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ నిర్వహిస్తారు.
  • డిసెంబర్ 3న రీపోలింగ్ అవసరమైతే నిర్వహిస్తారు.
  • డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఎన్నికలు పూర్తయిన తర్వాత మెజార్టీ డివిజన్ లు గెల్చిన పార్టీకి పాలించడానికి అవకాశం ఇస్తారు. అదే పార్టీ నుంచి మేయర్‌ను ఎన్నుకుంటారు.

Advertisement

Similar News