గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన ఒంటరి పోటీ... బీజేపీతో కలిసి సాగనట్లేనా!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తమ మిత్రుడిగా భావించిన బిజెపికి నిరాశ ఎదురయ్యేలా ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ తో కలిసి సాగాలని బిజెపి ఆశిస్తున్నప్పటికి పవన్ మాత్రం ఆ ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీకి దిగుతున్నట్లు పవన్ మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. ఇదేంటి.. మొన్ననే కదా ఇద్దరికి మధ్య చుట్టరికం కలిసింది.. కలిసి ఒక ఎన్నికలో కూడా పోటీ […]

Advertisement
Update: 2020-11-17 09:34 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తమ మిత్రుడిగా భావించిన బిజెపికి నిరాశ ఎదురయ్యేలా ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ తో కలిసి సాగాలని బిజెపి ఆశిస్తున్నప్పటికి పవన్ మాత్రం ఆ ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీకి దిగుతున్నట్లు పవన్ మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు.

ఇదేంటి.. మొన్ననే కదా ఇద్దరికి మధ్య చుట్టరికం కలిసింది.. కలిసి ఒక ఎన్నికలో కూడా పోటీ చేయకుండానే వారి మధ్య బంధం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. దీంతో వారి మధ్య సంబంధాల‌పై చ‌ర్చ మొద‌లైంది.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న బీజేపీ … అదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు దూకుడుగా ముందుకు సాగుతోంది సీనియర్ నాయ‌కుల‌తో క‌మిటీల‌ను ఏర్పాటు చేసి ఎన్నిక‌ల‌కు స‌మాయాత్త‌మైంది.

ఇలాంటి కీలక సమయంలో తమతో కలిసి వస్తాడనుకున్న పవన్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో బిజెపికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

అయితే తాము సైతం ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ముందుకు పోతున్నారు.

Advertisement

Similar News