మరోసారి అగ్గి రాజేసిన పూరి

పూరి జగన్నాధ్ మ్యూజింగ్స్ ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లాక్ డౌన్ లో సూపర్ హిట్ అయిన అతి తక్కువ అంశాల్లో ఇవి కూడా ఒకటి. ఓవైపు ఓటీటీలో వస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే.. పూరి ప్రసంగాలు మాత్రం తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలకు కూడా కేంద్రబిందువయ్యాడు పూరి జగన్నాధ్. అప్పట్లో రిజర్వేషన్లు, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీపావళి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. కిడ్నాప్ […]

Advertisement
Update: 2020-11-14 05:23 GMT

పూరి జగన్నాధ్ మ్యూజింగ్స్ ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లాక్ డౌన్ లో సూపర్ హిట్ అయిన అతి తక్కువ అంశాల్లో ఇవి కూడా ఒకటి. ఓవైపు ఓటీటీలో వస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే.. పూరి ప్రసంగాలు మాత్రం తూటాల్లా పేలుతున్నాయి.

ఈ క్రమంలో కొన్ని వివాదాలకు కూడా కేంద్రబిందువయ్యాడు పూరి జగన్నాధ్. అప్పట్లో రిజర్వేషన్లు, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీపావళి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. కిడ్నాప్ అయిన ఓ మ్యారీడ్ వైఫ్ తిరిగి ఇంటికొచ్చిన సందర్భంగా దీపావళి చేసుకుంటున్నారంటూ రామాయణానికి తనదైన వెర్షన్ ఇచ్చాడు పూరి.

ఇప్పుడీ దర్శకుడు మరో అగ్గి రాజేశాడు. ఈసారి ఏకంగా బ్రిటిషర్లను వెనకేసుకొచ్చాడు. భారతదేశాన్ని వందేళ్లకు పైగా పాలించి, భారతీయులను చిత్రహింసలకు గురిచేసిన బ్రిటిషర్లను చూసి చాలా నేర్చుకోవచ్చని అంటున్నాడు పూరి. కార్యనిర్వహణ, క్రమశిక్షణ లాంటివి వాళ్లను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

చివరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. మంచి విషయం మన శత్రువులో ఉన్నా చూసి నేర్చుకోవాలని.. ఈ విషయంలో తనను తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నట్టు స్పందించాడు పూరి.

Advertisement

Similar News