మహేష్ మూవీకి ముహూర్తం ఫిక్స్

అక్షరాలా మహేష్ కెరీర్ లో ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. వచ్చే ఏడాది జనవరికి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. పరశురామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్స్ ఖరారయ్యాయి. జనవరి మొదటివారంలో అమెరికాలో సర్కారువారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సియాటిల్, డెట్రాయిట్ లో సినిమాను షూట్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ మేరకు లొకేషన్లు కూడా ఫిక్స్ చేశారు. మహేష్, […]

Advertisement
Update: 2020-10-31 20:30 GMT

అక్షరాలా మహేష్ కెరీర్ లో ఏడాది గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. వచ్చే ఏడాది జనవరికి కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. పరశురామ్ దర్శకత్వంలో చేయాల్సిన ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్స్ ఖరారయ్యాయి.

జనవరి మొదటివారంలో అమెరికాలో సర్కారువారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సియాటిల్, డెట్రాయిట్ లో సినిమాను షూట్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ మేరకు లొకేషన్లు కూడా ఫిక్స్ చేశారు. మహేష్, కీర్తిసురేష్ తో పాటు మిగతా యూనిట్ అందరికీ వీసా ప్రాసెస్ ముగియడంతో ఈ తేదీలు ఫిక్స్ అయ్యాయి.

అంతా బాగానే ఉంది కానీ జనవరి నాటికి అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంది. ఎఁదుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. జనవరి నాటికి అది అమెరికాలో విజృంభించే అవకాశం కూడా ఉంది. అదే కనుక జరిగితే మహేష్ మూవీ షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం.

Advertisement

Similar News