సీజేకు సీఎం లేఖ రాయవచ్చు...

న్యాయమూర్తులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్‌ అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఘర్షణ ఉండకూదన్నారు. ఈ రెండు వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలు అని అభివర్ణించారు. న్యాయవ్యవస్థలోని లోపాలపై ప్రధానన్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఎవరో ఒక […]

Advertisement
Update: 2020-10-18 21:00 GMT

న్యాయమూర్తులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్‌ అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఘర్షణ ఉండకూదన్నారు.

ఈ రెండు వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలు అని అభివర్ణించారు. న్యాయవ్యవస్థలోని లోపాలపై ప్రధానన్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థకు ఎప్పటికీ కళంకం కాబోదన్నారు. ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అన్న అంశంపై గుంటూరులో జరిగిన కార్యక్రమంంలో ఆన్‌లైన్‌ ద్వారా జస్టిస్ బి చంద్రకుమార్‌ ప్రసంగించారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Advertisement

Similar News