గ్యాగ్‌ ఆర్డర్‌ ఎత్తివేతకు నో...

ఇటీవల అమరావతి భూకుంభకోణంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తివేయడంతో పాటు… దమ్మాలపాటి కేసులో వాదనలు వినిపించేందుకు తననూ ఇంప్లీడ్ చేయాలంటూ న్యాయవాది మమతారాణి ఇటీవల పిటిషన్ వేశారు. గ్యాగ్ ఆర్డర్‌ను సవరించేందుకు సుముఖత చూపలేదు. కేసులో మమతారాణిని ఇంప్లీడ్ చేసేందుకు కూడా అంగీకరించలేదు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం నిర్వహించిన ప్రెస్‌మీట్ కారణంగా తామిచ్చిన గ్యాగ్ ఆర్డర్ నిరుపయోగం అయిందని ప్రధాన న్యాయమూర్తి […]

Advertisement
Update: 2020-10-16 23:29 GMT

ఇటీవల అమరావతి భూకుంభకోణంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తివేయడంతో పాటు… దమ్మాలపాటి కేసులో వాదనలు వినిపించేందుకు తననూ ఇంప్లీడ్ చేయాలంటూ న్యాయవాది మమతారాణి ఇటీవల పిటిషన్ వేశారు.

గ్యాగ్ ఆర్డర్‌ను సవరించేందుకు సుముఖత చూపలేదు. కేసులో మమతారాణిని ఇంప్లీడ్ చేసేందుకు కూడా అంగీకరించలేదు.

ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం నిర్వహించిన ప్రెస్‌మీట్ కారణంగా తామిచ్చిన గ్యాగ్ ఆర్డర్ నిరుపయోగం అయిందని ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో అమరావతి భూవ్యవహారానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, ఇతర డాక్యుమెంట్లు అన్నీ ప్రతి ఒక్కరికీ ఇచ్చారని దాని వల్ల గ్యాగ్ ఆర్డర్‌ నిరుపయోగంగా మారిందని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ నేపథ్యంలో గ్యాగ్‌ ఆర్డర్‌ను సవరించాల్సిన అవసరం లేదంటూ పిటిషన్లను తిరస్కరించారు.

జోక్యం చేసుకున్న ప్రభుత్వ న్యాయవాది…అజయ్ కల్లం నిర్వహించిన మీడియా సమావేశం… అమరావతి కుంభకోణంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ గురించి కాదని… దానికి దీనికి సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించలేదు.

Advertisement

Similar News