గల్లా అరుణకుమారి రాజీనామా

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి మాజీమంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెబుతున్నా పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకే ఆమె రాజీనామా చేశారన్న వాదన వినిపిస్తోంది. టీడీపీని పునర్‌ వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ వర్గాలు మాత్రం ఆమె పొలిట్‌బ్యూరోకు మాత్రమే రాజీనామా చేశారని… పార్టీలో కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గల్లా అరుణకుమారి కుమారుడు […]

Advertisement
Update: 2020-10-01 04:51 GMT

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి మాజీమంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెబుతున్నా పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చకే ఆమె రాజీనామా చేశారన్న వాదన వినిపిస్తోంది.

టీడీపీని పునర్‌ వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ వర్గాలు మాత్రం ఆమె పొలిట్‌బ్యూరోకు మాత్రమే రాజీనామా చేశారని… పార్టీలో కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గల్లా అరుణకుమారి కుమారుడు జయదేవ్‌ ప్రస్తుతం గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్నారు.

Advertisement

Similar News