బాలు పాడిన చివరి పాట ఇదేనా!

కరోనా బారిన పడిన బాలు, ఆ వైరస్ తగ్గినప్పటికీ ఊపిరితిత్తుల సమస్య వల్ల కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాలు హాస్పిటల్ బిల్లుపై ఓ రేంజ్ లో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించాడు కూడా. ఇప్పుడు బాలుకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆయన ఆఖరి పాట ఏంటనేది ఆ డిస్కషన్. నిజమే.. బాలు పాడిన చివరి పాట ఏది? దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బాలు తుదిశ్వాస […]

Advertisement
Update: 2020-09-28 22:08 GMT

కరోనా బారిన పడిన బాలు, ఆ వైరస్ తగ్గినప్పటికీ ఊపిరితిత్తుల సమస్య వల్ల కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాలు హాస్పిటల్ బిల్లుపై ఓ రేంజ్ లో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించాడు కూడా. ఇప్పుడు బాలుకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆయన ఆఖరి పాట ఏంటనేది ఆ డిస్కషన్.

నిజమే.. బాలు పాడిన చివరి పాట ఏది? దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. బాలు తుదిశ్వాస విడవడానికి ముందు కరోనా అవగాహనపై ఓ పాట పాడారు. అదే ఆయన ఆలపించిన చివరి పాట అంటారు. అయితే సినిమాలకు సంబంధించి బాలు పాడిన చివరి పాట మాత్రం రజనీకాంత్ కోసమే.

అవును.. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తె సినిమాలో సూపర్ స్టార్ ఇంట్రో సాంగ్ ను బాలు ఆలపించారు. ఇక్కడ బాలు-రజనీకాంత్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుుకోవాలి. రజనీకాంత్ నటించిన సినిమాలకు ఇంట్రో సాంగ్స్ అన్నీ బాలు పాడినవే. అవన్నీ సూపర్ హిట్టయ్యాయి కూడా. ఆ సెంటిమెంట్ తో అన్నాత్తె సినిమాకు కూడా బాలుతోనే ఇంట్రో సాంగ్ పాడించారు. అదే ఆయన పాడిన ఆఖరి పాట.

Advertisement

Similar News