జనవరిలో శశికళ విడుదల

తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ విడుదల తేదీపై ఒక స్పష్టత వచ్చింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ 2017 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. తాజాగా ఒక వ్యక్తి శశికళ ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతారు అన్నది తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద జైళ్ల శాఖకు దరఖాస్తు పెట్టారు. దానికి స్పందించిన బెంగళూరు […]

Advertisement
Update: 2020-09-15 02:47 GMT

తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ విడుదల తేదీపై ఒక స్పష్టత వచ్చింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ 2017 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆమెకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. తాజాగా ఒక వ్యక్తి శశికళ ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతారు అన్నది తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద జైళ్ల శాఖకు దరఖాస్తు పెట్టారు. దానికి స్పందించిన బెంగళూరు సెంట్రల్ జైలు అధికారులు సమాధానం ఇచ్చారు.

2021 జనవరి 27న శశికళ విడుదల అవుతారని సమాధానం వచ్చింది. అయితే జరిమానా కూడా చెల్లిస్తేనే వచ్చే ఏడాది 2021 జనవరి 27న విడుదలవుతారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 2022 ఫిబ్రవరి 27 వరకు ఆమె జైలులోనే ఉండాల్సి ఉంటుందని జైలు అధికారులు సమాధానం ఇచ్చారు. శిక్షతోపాటు ఆమెకు కోర్టు 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది.

జయలలిత తర్వాత శశికళ సీఎం అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ పరిస్థితులు సహకరించకపోవడం, కేంద్రంలో బీజేపీ ఆమెకు వ్యతిరేకంగా పావులుకదపడం, సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించడంతో శశికళ రాజకీయ జీవితం ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చినా పరిస్థితులు అంత సులువుగా సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. ఆమెకు ఫైన్ కట్టడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు కాబట్టి జైలు అధికారులు చెబుతున్నట్టుగా 2021 జనవరి 27న ఆమె బయటకు రావొచ్చు. బయటకు వచ్చినా జైలు శిక్ష పడిన కారణంగా మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆమెకు ఉండదు. తెరవెనుక చక్రం తిప్పాల్సిందే.

Advertisement

Similar News