అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు

అమరావతి భూకుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాం దర్యాప్తులోకి ఏసీబీ కూడా ఎంటరైంది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం, సిట్‌లు అమరావతిలో కుంభకోణం జరిగింది నిజమేనని తేల్చాయి. నాటి ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు తేల్చింది. ఏసీబీ బినామీ లావాదేవీల సంగతి తేల్చనుంది. రాజధాని ప్రకటించడానికి ముందే చంద్రబాబు, ఆయన సన్నిహితులు రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో సమాచారం పంచుకుని […]

Advertisement
Update: 2020-09-15 02:38 GMT

అమరావతి భూకుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాం దర్యాప్తులోకి ఏసీబీ కూడా ఎంటరైంది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం, సిట్‌లు అమరావతిలో కుంభకోణం జరిగింది నిజమేనని తేల్చాయి.

నాటి ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు తేల్చింది. ఏసీబీ బినామీ లావాదేవీల సంగతి తేల్చనుంది.

రాజధాని ప్రకటించడానికి ముందే చంద్రబాబు, ఆయన సన్నిహితులు రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో సమాచారం పంచుకుని భారీగా భూములు కొన్నారన్నది ఆరోపణ. రాజధాని ప్రకటన వెలువడకముందే అక్కడి రైతుల నుంచి, పేదల నుంచి తక్కువ ధరకు వేల ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 జూన్‌ ఒకటి నుంచి… 2014 డిసెంబర్‌ 31 లోపు ఈ తరహాలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ద్వారా 4వేల 69 ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేశారని సిట్ తేల్చింది. ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగింది.

Advertisement

Similar News