లక్ష కోట్లతో అమరావతి ఒక వికృత ఆలోచన " జగన్‌

అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమరావతి గురించి కుండబద్దలుకొట్టినట్టు తన అభిప్రాయాలను జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు. లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మించాలన్న ఆలోచనను ఒక వికృతమైన ఆలోచనగా అభివర్ణించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిని భారీ నగరంగా నిర్మించడం ఏమాత్రం వాంచనీయం కాదని జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీని వల్ల ఉన్నవనరులు హరించుకుపోవడంతోపాటు రాష్ట్ర ప్రజలపై అదనపు భారం తప్ప […]

Advertisement
Update: 2020-09-10 00:36 GMT

అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమరావతి గురించి కుండబద్దలుకొట్టినట్టు తన అభిప్రాయాలను జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు. లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మించాలన్న ఆలోచనను ఒక వికృతమైన ఆలోచనగా అభివర్ణించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిని భారీ నగరంగా నిర్మించడం ఏమాత్రం వాంచనీయం కాదని జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీని వల్ల ఉన్నవనరులు హరించుకుపోవడంతోపాటు రాష్ట్ర ప్రజలపై అదనపు భారం తప్ప ఏమీ ఉండదన్నారు.

విశాఖ పట్నం కూడా ప్రస్తుత స్థాయికి రావడానికి కొన్ని దశాబ్దాలు పట్టిందని గుర్తు చేశారు. నగరాలు కడితే డబ్బులు వస్తాయనుకోవడం సరైన ఆలోచన కాదని… గ్రీన్‌ ఫీల్ట్ సిటీల నిర్మాణం ప్రపంచం మొత్తం మీద కొన్ని చోట్ల మినహా మరెక్కడా విజయవంతమైన దాఖలాలు లేవని సీఎం గుర్తు చేశారు. అసలు చంద్రబాబు చెబుతున్నట్టు అమరావతి కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని సీఎం ప్రశ్నించారు.

ప్రపంచంలో పెద్దపెద్ద నగరాలు తయారవడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పట్టిందని గుర్తు చేశారు. లక్ష కోట్లు పెట్టి నగరం నిర్మించడం ఏమాత్రం లాభదాయకం కాదని వివరించారు. అలా చేస్తే అదనపు ఆదాయం కాదు కదా… నగర నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేమని విశ్లేషించారు. చంద్రబాబు ప్రభుత్వం తయారు చేసిన నివేదిక ప్రకారమే అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాల్సి ఉంటుందన్నారు.

అసలు అభివృద్ధి మొత్తం ఒకేచోట ఎందుకు కేంద్రీకరించాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెన్నై, హైదరాబాద్‌ల విషయంలో నష్టపోయారని గుర్తు చేశారు. మరోసారి అన్ని ఒకే చోట కేంద్రీకరిస్తే మరోసారి బాధపడాల్సి ఉంటుందన్నారు. అమరావతి కూడా రాష్ట్రంలో భాగమేనని అక్కడా అభివృద్ధిని కొనసాగిస్తామని సీఎం చెప్పారు. శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు.

Advertisement

Similar News