రియా టీ షర్టు మీదున్న మాటలకు అర్థం... ఇదే !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో… డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలతో రియా చక్రవర్తి అరెస్టయింది. ఆ సమయంలో ఆమె నలుపురంగు టీషర్టుని ధరించింది. దానిపైన ‘రోజెస్ ఆర్ రెడ్…వైలెట్స్ ఆర్ బ్లూ…’ అనే పదాలతో పాటు… ‘నువ్వు నేను కలిసి పితృస్వామ్యాన్ని అంతం చేద్దాం…’ అనే అర్థంతో ఉన్న ఆంగ్ల మాటలు ఉన్నాయి. పలువురు తారలు ఆమెకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ… ఆ మాటలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మగవారి […]

Advertisement
Update: 2020-09-09 21:30 GMT

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో… డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలతో రియా చక్రవర్తి అరెస్టయింది. ఆ సమయంలో ఆమె నలుపురంగు టీషర్టుని ధరించింది. దానిపైన ‘రోజెస్ ఆర్ రెడ్…వైలెట్స్ ఆర్ బ్లూ…’ అనే పదాలతో పాటు… ‘నువ్వు నేను కలిసి పితృస్వామ్యాన్ని అంతం చేద్దాం…’ అనే అర్థంతో ఉన్న ఆంగ్ల మాటలు ఉన్నాయి. పలువురు తారలు ఆమెకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ… ఆ మాటలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

మగవారి ఆధిపత్యం ప్రముఖంగా కనిపించే సమాజంలో మహిళలు అన్యాయానికి గురవుతున్నారనే అర్థమే ప్రధానంగా రియా టీ షర్టుపైన ఉన్న పదాల్లో కనిపించినా… నిజానికి ఆ మాటలను వాడిన సందర్భం వేరు. స్త్రీలు నెలసరి సమయంలో వాడే శానిటరీ నేప్ కిన్స్ కి సంబంధించిన ఒక ప్రచారంలోని భాగం అవి. ‘రోజెస్ ఆర్ రెడ్’ అంటూ సాగిన ఆ ప్రచారాన్ని ఆన్ లైన్ లో దుస్తులు, ఇతర అలంకరణ సామగ్రిని విక్రయించే సంస్థ ఒకటి నిర్వహించింది.

రుతుక్రమంలో శుభ్రతని గురించిన అవగాహన పెంచడం, గ్రామీణ మహిళలకు శానిటరీ నేప్ కిన్స్ అందించేందుకు నిధులు సమకూర్చే ప్రయత్నం…. ఈ స్లోగన్ వెనుక ఉన్నాయి. ఒక టీషర్టు అమ్మటం ద్వారా… ఒక బాలికకి సంవత్సరంపాటు అవసరమైన శానిటరీ నేప్ కిన్స్ ని అందించగల డబ్బు వచ్చేలా… అలాంటి ప్రణాళికలతో ఆ సంస్థ విక్రయాలు చేసింది. రియా ధరించిన టీషర్టు అదే. ఆమె టీ షర్టుపై ఉన్న పొయిమ్ లో… మగవారి ఆధిపత్యంతో సాగే పితృస్వామ్య సమాజంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారనే అర్థం ఉంది.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే…రియా చక్రవర్తి ఈ నెల 22 వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీలో ఉంటుంది. తనని తప్పుడు ఆరోపణలతో ఈ కేసులో ఇరికించారని పేర్కొంటూ ఆమె బెయిల్ కి అప్లయి చేసినట్టుగా తెలుస్తోంది.

Advertisement

Similar News