విజయసాయిరెడ్డిపై అనర్హత వర్తించదు " రాష్ట్రపతి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను రాష్ట్రపతి తోసి పుచ్చారు. విజయసాయిరెడ్డి లాభదాయకమైన జోడుపదవుల్లో ఉన్నారంటూ సీహెచ్‌ రామకోటయ్య రాష్ట్రపతికి కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి… ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవడం చట్ట విరుద్ధమని… కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి పంపించారు. పిటిషన్‌ను పరిశీలించిన ఈసీ… పార్లమెంట్ చట్టం- 1959 ప్రకారం విజయసాయిరెడ్డిపై […]

Advertisement
Update: 2020-09-07 20:38 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను రాష్ట్రపతి తోసి పుచ్చారు. విజయసాయిరెడ్డి లాభదాయకమైన జోడుపదవుల్లో ఉన్నారంటూ సీహెచ్‌ రామకోటయ్య రాష్ట్రపతికి కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి… ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవడం చట్ట విరుద్ధమని… కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో కోరారు.

ఈ ఫిర్యాదును ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి పంపించారు. పిటిషన్‌ను పరిశీలించిన ఈసీ… పార్లమెంట్ చట్టం- 1959 ప్రకారం విజయసాయిరెడ్డిపై ఈ అంశంలో అనర్హత వర్తించదని సమాధానం ఇచ్చింది. ఎలాంటి జీతభత్యాలు తీసుకోలేదు కాబట్టి ప్రత్యేక ప్రతినిధి పదవిని లాభదాయకమైన పదవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

ఈసీ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వర్తించదని రాష్ట్రపతి కార్యాలయం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Advertisement

Similar News