మాటలతో మాయ చేస్తున్నాడు

సినిమా ఫీల్డ్ లో గ్లామర్ తో మాయ చేసేవాళ్లున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ తో మాయ చేసే వాళ్లున్నారు. వీళ్లతో పాటు మాటలతో మాయచేసే జనాలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా మాటలతో మాయ చేస్తున్నాడు. అయితే ఇదేదో నెగెటివ్ సెన్స్ తో చెప్పింది కాదు. పూర్తిగా మెచ్చుకోలుగా చెప్పిన మాట ఇది. అతడే పూరి జగన్నాధ్. రీసెంట్ గా పాడ్ కాస్ట్ లోకి ఎంటరయ్యాడు పూరి జగన్నాధ్. ఇప్పటికే తన సినిమాల్లో […]

Advertisement
Update: 2020-08-31 10:00 GMT

సినిమా ఫీల్డ్ లో గ్లామర్ తో మాయ చేసేవాళ్లున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ తో మాయ చేసే వాళ్లున్నారు. వీళ్లతో పాటు మాటలతో మాయచేసే జనాలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా మాటలతో మాయ చేస్తున్నాడు. అయితే ఇదేదో నెగెటివ్ సెన్స్ తో చెప్పింది కాదు. పూర్తిగా మెచ్చుకోలుగా చెప్పిన మాట ఇది. అతడే పూరి జగన్నాధ్.

రీసెంట్ గా పాడ్ కాస్ట్ లోకి ఎంటరయ్యాడు పూరి జగన్నాధ్. ఇప్పటికే తన సినిమాల్లో డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ డైరక్టర్.. ఇప్పుడు పాడ్ కాస్ట్ రూపంలో చెలరేగిపోతున్నాడు. వివిధ అంశాలపై పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఇస్తున్న విశ్లేషణలు యూత్ ను కట్టి పడేస్తున్నాయి.

డబ్బు, జీవితం, అమ్మాయిలు, తెలివితేటలు, ఉత్సాహం, పుస్తకాలు, వయసు, భర్త, ఆచారాలు, రిజర్వేషన్లు.. ఇలా అనేక అంశాలపై పూరి జగన్నాధ్ చెబుతున్న మాటలు అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అదే టైమ్ లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి.

Advertisement

Similar News