తెలుగు భాషపై 'అల్లు'కున్న ప్రేమ

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు అల్లు శిరీష్. నిజానికి తనకు స్కూల్ లో తెలుగు నేర్పించలేదని, తన తెలుగు భాషా నైపుణ్యానికి కారణభూతులు ఎవరో బయటపెట్టాడు. “చెన్నైలో పెరగడం వల్ల నేను చదువుకున్న స్కూల్ లో హిందీ-తమిళ్ మాత్రమే నేర్పించారు. కానీ కచ్చితంగా మాతృభాష నేర్చుకోవాలని చెప్పేవారు మా తాతగారు (అల్లు రామలింగయ్య). అంతేకాదు.. మా కోసం ఇంట్లో ట్యూషన్స్ పెట్టించారు. ఆ తర్వాత అమ్మ నాకు నేర్పించింది.” ఇలా […]

Advertisement
Update: 2020-08-29 21:57 GMT

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు అల్లు శిరీష్. నిజానికి తనకు స్కూల్ లో తెలుగు నేర్పించలేదని, తన తెలుగు భాషా నైపుణ్యానికి కారణభూతులు ఎవరో బయటపెట్టాడు.

“చెన్నైలో పెరగడం వల్ల నేను చదువుకున్న స్కూల్ లో హిందీ-తమిళ్ మాత్రమే నేర్పించారు. కానీ కచ్చితంగా మాతృభాష నేర్చుకోవాలని చెప్పేవారు మా తాతగారు (అల్లు రామలింగయ్య). అంతేకాదు.. మా కోసం ఇంట్లో ట్యూషన్స్ పెట్టించారు. ఆ తర్వాత అమ్మ నాకు నేర్పించింది.”

ఇలా తన తెలుగు భాషకు కారణం అమ్మ-తాత అనే విషయాన్ని బయటపెట్టాడు అల్లు శిరీష్. తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తనకు తెలుగు నేర్పించిన అమ్మా-తాతకు థ్యాంక్స్ చెప్పాడు ఈ హీరో.

ABCD అనే మూవీ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు ఈ హీరో.

Advertisement

Similar News