ఏపీలో మీడియాది విధ్వంసకర పాత్ర " ఐఐఎం రిపోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పాత్రపై అహ్మదాబాద్‌ – ఐఐఎం తన నివేదికలో సంచలన అంశాలను ప్రస్తావించింది. రెండు రోజుల క్రితమే ఐఐఎం తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిర్మూలించడం ఎలా అన్న దానిపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్‌ ఐఐఎంతో గతేడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ నివేదికలో ఏపీలో మీడియా పాత్రను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక మీడియా ఒక విధ్వంసకర పాత్రను పోషిస్తోందని ఐఐఎం నివేదించింది. ఇలాంటి మీడియాను పరిపాలనకు వీలైనంత […]

Advertisement
Update: 2020-08-26 22:33 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పాత్రపై అహ్మదాబాద్‌ – ఐఐఎం తన నివేదికలో సంచలన అంశాలను ప్రస్తావించింది. రెండు రోజుల క్రితమే ఐఐఎం తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిర్మూలించడం ఎలా అన్న దానిపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్‌ ఐఐఎంతో గతేడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఈ నివేదికలో ఏపీలో మీడియా పాత్రను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక మీడియా ఒక విధ్వంసకర పాత్రను పోషిస్తోందని ఐఐఎం నివేదించింది. ఇలాంటి మీడియాను పరిపాలనకు వీలైనంత దూరం ఉంచాలని సిఫార్సు చేసింది. మీడియా అనేక అంశాల్లో మధ్యవర్తిత్వం వహిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి స్థానిక మీడియా తన ఇష్టాయిష్టాలను జోడించి ప్రజల ముందుకు కథనాల రూపంలో తీసుకెళ్తోందని… దీని వల్ల ప్రభుత్వ యంత్రాంగం బాగా ఒత్తిడికి గురవుతోందని ఐఐఎం నివేదించింది.

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరగడానికి మీడియా కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషించింది. కాబట్టి మీడియాను దూరంగా ఉంచాలని నివేదించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. లంచాలు తీసుకునేందుకు అవకాశం లేని విధంగా వ్యవస్థను తయారు చేయడం ఎలా అన్న దానిపైనా చర్చించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఉపయోగించడం ద్వారా అవినీతికి చెక్ పెట్టవచ్చని సూచించింది.

Advertisement

Similar News