కరోనాను జయించిన జపాన్ నగరాలు

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పలు దేశాల్లో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కాగా, కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రపంచంలోని అన్ని నగరాల కంటే జపాన్ దేశ నగరాలు ముందంజలో ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయడంతో పాటు కోవిడ్-19 అదుపునకు ప్రత్యేక వ్యూహాలు రచించడంతో ఇది సాధ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. గత […]

Advertisement
Update: 2020-08-25 22:57 GMT

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పలు దేశాల్లో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కాగా, కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రపంచంలోని అన్ని నగరాల కంటే జపాన్ దేశ నగరాలు ముందంజలో ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయడంతో పాటు కోవిడ్-19 అదుపునకు ప్రత్యేక వ్యూహాలు రచించడంతో ఇది సాధ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. గత వారం చివరి నాటికి జపాన్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 60 వేలు. మూడు కోట్ల జనాభా కలిగిన టోక్యో నగరంలో 84 గజాలకు ఒకరు చొప్పున నివసిస్తుండగా.. 19 వేల మంది కరోనా బారిన పడ్డారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 27వేల చదరపు గజాలకు ఒకరే నివసిస్తున్నారు. అయినా అక్కడ ఏకంగా 4.56 లక్షల మంది కరోనా బారిన పడటం గమనార్హం.

జపాన్ వాసులు క్రమశిక్షణతో మెలగడం వల్లే అక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదని నిపుణులు అంటున్నారు. ఫుట్‌పాత్‌లపై ఒక వరుస క్రమంలో నడవటం, ట్రాఫిక్ రద్దీ లేకపోయినా అందరూ మెట్రోల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం వంటివి చేయడం వల్లే అక్కడ కేసుల నమోదు తక్కువగా ఉంది. అక్కడ రెస్టారెంట్లు, మాల్స్, పాఠశాలలు మూసి వేయకపోయినా.. వారి శుభ్రతా అలవాట్లే వారిని కరోనా నుంచి రక్షించాయని అంటున్నారు.

అక్కడ ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించారని, చేతులు కలపడం కూడా వీళ్లు చేయకపోవడం కలసి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా జపాన్ వాసుల క్రమశిక్షణే వారిని కాపాడినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Similar News