టీవీ5, న్యూస్‌ 18కి బాలినేని లీగల్ నోటీసులు

టీడీపీనేతలకు, మీడియా సంస్థలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తప్పుడు ప్రచారంపై తక్షణం క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత నెల 14న తమిళనాడులోని ఎలపూరు చెక్‌పోస్టు వద్ద కొందరి నుంచి 5 కోట్ల నగదును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కారుపై ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో పాటు పట్టుబడిన వారు ఒంగోలుకు చెందిన వారు […]

Advertisement
Update: 2020-08-21 21:12 GMT

టీడీపీనేతలకు, మీడియా సంస్థలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తప్పుడు ప్రచారంపై తక్షణం క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత నెల 14న తమిళనాడులోని ఎలపూరు చెక్‌పోస్టు వద్ద కొందరి నుంచి 5 కోట్ల నగదును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కారుపై ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో పాటు పట్టుబడిన వారు ఒంగోలుకు చెందిన వారు కావడంతో టీడీపీ నేతలు వెంటనే ఆ డబ్బు బాలినేని శ్రీనివాస్ రెడ్డిదే అంటూ ప్రచారం చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ డబ్బు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిదే అంటూ ప్రచారం చేశాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నారా లోకేష్‌, బోండా ఉమా, పట్టాభిరాంతో పాటు మీడియా సంస్థలకు చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, సాంబశివరావుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. టీవీ5 చానల్‌తో పాటు న్యూస్‌ 18 చానల్‌కు నోటీసులు వెళ్లాయి. తక్షణం క్షమాపణ చెప్పకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.

Advertisement

Similar News