జగన్‌ టూర్ రద్దు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీ సాగునీటి ప్రాజెక్టుల నీటి అవసరాలపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు పూజలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ పరిధిలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల […]

Advertisement
Update: 2020-08-21 00:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీ సాగునీటి ప్రాజెక్టుల నీటి అవసరాలపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు పూజలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

తెలంగాణ పరిధిలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ ఇరిగేషన్ అధికారులు … ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడి సిబ్బందికి సంఘీభావం తెలిపారు.

సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను ఆదేశించారని ఏపీ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి నారాయణ రెడ్డి తెలిపారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం కుడిగట్టు నుంచి ఎలాంటి సహకారమైనా అందించాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని నారాయణరెడ్డి వివరించారు.

ఇలాంటి ఆపద సమయాల్లో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని అందుకే ఆయన ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చామని నారాయణరెడ్డి చెప్పారు.

Advertisement

Similar News