మధ్యప్రదేశ్‌ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కరోనా బారినపడ్డారు. సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌ రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆయన భోపాల్‌లోని ఓ ఆస్ప్రతిలో చేరారు. శివరాజ్‌ సింగ్‌ను కలిసిన బీజేపీ నేతలు, మంత్రులు, అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ సూచించారు. కరోనా సోకకుండా తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని… కానీ అనేక పనుల మీద చాలా […]

Advertisement
Update: 2020-07-25 07:07 GMT

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కరోనా బారినపడ్డారు. సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌ రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆయన భోపాల్‌లోని ఓ ఆస్ప్రతిలో చేరారు.

శివరాజ్‌ సింగ్‌ను కలిసిన బీజేపీ నేతలు, మంత్రులు, అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ సూచించారు. కరోనా సోకకుండా తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని… కానీ అనేక పనుల మీద చాలా మంది తనను కలిశారని దాని వల్ల వైరస్ సోకి ఉండవచ్చని సీఎం చెప్పారు.

తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధులు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇప్పటికే దేశంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులు కరోనా బారినపడ్డారు. కరోనా బారిన పడిన తొలి సీఎం శివరాజ్‌సింగ్ చౌహనే. ఆయన వయసు ప్రస్తుతం 61ఏళ్లు.

Tags:    
Advertisement

Similar News