ఏపీ దారిలో గుజరాత్

చాలా విషయాల్లో ఇతర రాష్ట్రాలకు ఏపీ విధానాలు ఆదర్శంగా మారుతున్నాయి. పీపీఏల విషయంలో తొలుత వైసీపీ ప్రభుత్వంపై పెద్దెత్తున ఒత్తిడి వచ్చింది. అయినా సరే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పుడు అదే పంథాను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం కూడా పీపీఏలపై చర్యలకు సిద్ధమైంది. అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద పెద్ద ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. అంతకు […]

Advertisement
Update: 2020-07-10 21:56 GMT

చాలా విషయాల్లో ఇతర రాష్ట్రాలకు ఏపీ విధానాలు ఆదర్శంగా మారుతున్నాయి. పీపీఏల విషయంలో తొలుత వైసీపీ ప్రభుత్వంపై పెద్దెత్తున ఒత్తిడి వచ్చింది. అయినా సరే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పుడు అదే పంథాను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం కూడా పీపీఏలపై చర్యలకు సిద్ధమైంది.

అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద పెద్ద ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. అంతకు ముందు ప్రభుత్వం ఈ పీపీఏలను చేసుకుంది. విదేశీ బొగ్గుతో నడిచే థర్మల్‌ ప్లాంట్లకు వేరియబుల్‌ కాస్ట్‌ రోజురోజుకు పెరుగుతోందని… దీని వల్ల డిస్కమ్‌లపై అధిక భారం పడుతోందని గుజరాత్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే పీపీఏలను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు దిశగా గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News