గల్లాకు షాక్‌

గల్లా జయదేవ్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీకి కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంది. కంపెనీ ఏర్పాటు చేస్తామంటూ మొత్తం 483.27 ఎకరాల భూమిని అమర రాజా సంస్థ తీసుకుంది. ఒప్పందం ప్రకారం రెండువేల 100 కోట్ల పెట్టబడితో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉంది. 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఆ లక్ష్యాన్ని అందుకోలేదు. 483 ఎకరాల భూమిలో 229 ఎకరాలను మాత్రమే వాడుకున్నారు. చెప్పిన స్థాయిలో పెట్టుబడి పెట్టలేదు. 20వేల […]

Advertisement
Update: 2020-06-30 05:47 GMT

గల్లా జయదేవ్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీకి కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంది. కంపెనీ ఏర్పాటు చేస్తామంటూ మొత్తం 483.27 ఎకరాల భూమిని అమర రాజా సంస్థ తీసుకుంది. ఒప్పందం ప్రకారం రెండువేల 100 కోట్ల పెట్టబడితో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉంది. 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి.

కానీ ఆ లక్ష్యాన్ని అందుకోలేదు. 483 ఎకరాల భూమిలో 229 ఎకరాలను మాత్రమే వాడుకున్నారు. చెప్పిన స్థాయిలో పెట్టుబడి పెట్టలేదు. 20వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా అందులో 20 శాతం ఉద్యోగులకు మించి కల్పించలేదు.

2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమర రాజా కంపెనీకి చిత్తూరు జిల్లా నూనెగుండపల్లి, కొత్తపల్లి వద్ద భూములు కేటాయించింది. అప్పట్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్‌లో ఉన్నారు. అలా కేటాయించిన భూమిలో 253. 61 ఎకరాల భూమి కంపెనీ వద్దే నిరుపయోగంగా ఉంది. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం కంపెనీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో 253.61 ఎకరాల భూమిని వెనక్కు తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

అమరరాజా కంపెనీ వద్ద నిరుపయోగంగా ఉన్న భూమి విలువ 60 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని జీవోలో ప్రభుత్వం వివరించింది. ఈ భూమిని కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే ఇతర సంస్థలకు ఏపీఐఐసీ కేటాయించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News