కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. బెంగాల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు చనిపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమోనాష్ ఘోష్ కరోనాతో చనిపోయారు. ఆయన వయసు 60ఏళ్లు. మే నెలల్లో తమోనాష్ కరోనా బారినపడ్డారు. చికిత్స తీసుకుంటున్నా ఫలితం లేకపోయింది. ఇలాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. 1998 నుంచి తృణముల్ కాంగ్రెస్‌లో ఆయన ఉన్నారు. ఎమ్మెల్యే మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తమోనాష్ […]

Advertisement
Update: 2020-06-23 23:36 GMT

దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. బెంగాల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు చనిపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమోనాష్ ఘోష్ కరోనాతో చనిపోయారు. ఆయన వయసు 60ఏళ్లు. మే నెలల్లో తమోనాష్ కరోనా బారినపడ్డారు. చికిత్స తీసుకుంటున్నా ఫలితం లేకపోయింది. ఇలాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు.

1998 నుంచి తృణముల్ కాంగ్రెస్‌లో ఆయన ఉన్నారు. ఎమ్మెల్యే మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తమోనాష్ మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లోనూ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. బెంగాల్‌లో మొత్తం 14వేల 700 కేసులు నమోదు అయ్యాయి. 580 మంది చనిపోయారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ చనిపోయారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News