సల్మాన్ పై జియాఖాన్ తల్లి ఆరోపణలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటి కోణాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెపోటిజంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఓ వర్గం, కొన్ని కుటుంబాలకు మాత్రమే బాలీవుడ్ పరిమితం అనే డిస్కషన్ ఊపందుకుంది. ఇదే క్రమంలో ఒకప్పుడు ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. స్వయంగా జియాఖాన్ తల్లి రబీనా అమీన్ ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2013లో జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఎందుకు చనిపోయిందో ప్రపంచం మొత్తానికి […]

Advertisement
Update: 2020-06-17 20:39 GMT

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటి కోణాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెపోటిజంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఓ వర్గం, కొన్ని కుటుంబాలకు మాత్రమే బాలీవుడ్ పరిమితం అనే డిస్కషన్ ఊపందుకుంది. ఇదే క్రమంలో ఒకప్పుడు ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. స్వయంగా జియాఖాన్ తల్లి రబీనా అమీన్ ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

2013లో జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఎందుకు చనిపోయిందో ప్రపంచం మొత్తానికి తెలుసని, సూరజ్ పంచోళీ వల్ల జియాఖాన్ చనిపోయిందని చెప్పింది రబీనా. అలా క్లియర్ గా ఉన్న కేసును తన పలుకుబడి, డబ్బుతో సల్మాన్ ఖాన్ నీరుగార్చారంటూ ఆరోపించింది. వ్యవస్థల్ని మేనేజ్ చేసి సల్మాన్ ఖాన్, తన కూతురికి మరింత అన్యాయం చేశాడని ఆరోపించింది.

మరణానికి ముందు సూపర్ పంచోలీ, జియాఖాన్ ను ఎంత మానసిక క్షోభకు గురిచేశాడో.. మరణం తర్వాత జియాఖాన్ ఆత్మను సల్మాన్ ఖాన్ అంత క్షోభకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేసింది రబీనా. మొత్తమ్మీద సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో జియాఖాన్ ఆత్మహత్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News