సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత

ప్రముఖ సినీ గేయరచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్లుగా లివర్ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఈరోజు సుద్దాలను గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రేపు సుద్దాలకు వైద్యులు లివర్ ట్రాన్సప్లాంటేషన్ చేయబోతున్నారు. హాస్పిటల్ లో జాయిన్ అయ్యేముందు నటుడు చిరంజీవి, సుద్దాలను పరామర్శించారు. అంతేకాదు.. ఆపరేషన్ కు అవసరమయ్యే రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి సదరు హాస్పిటల్ కు అందించారు. నటుడు ఉత్తేజ్ కు […]

Advertisement
Update: 2020-05-22 07:44 GMT

ప్రముఖ సినీ గేయరచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్లుగా లివర్ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఈరోజు సుద్దాలను గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రేపు సుద్దాలకు వైద్యులు లివర్ ట్రాన్సప్లాంటేషన్ చేయబోతున్నారు.

హాస్పిటల్ లో జాయిన్ అయ్యేముందు నటుడు చిరంజీవి, సుద్దాలను పరామర్శించారు. అంతేకాదు.. ఆపరేషన్ కు అవసరమయ్యే రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి సదరు హాస్పిటల్ కు అందించారు. నటుడు ఉత్తేజ్ కు సుద్దాల అశోక్ తేజ స్వయంగా మామయ్య అవుతారు. సుద్దాలకు సంబంధించిన హెల్త్ అప్ డేట్స్ ను ఉత్తేజ్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

తెలుగు సినీరంగంలో గేయరచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుద్దాల అశోక్ తేజ. చిన్నప్పట్నుంచే సాహిత్యంపై మమకారం పెంచుకున్న సుద్దాల, ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఉత్తేజ్ సహకారంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటివరకు 12 వందలకు పైగా సినిమాలకు పనిచేసి, 2వేలకు పైగా పాటలు రాశారు. ఠాగూర్ సినిమాకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు సుద్దాల అశోక్ తేజ.

Tags:    
Advertisement

Similar News