ఎట్టకేలకు ఓపెన్ అయిన తమన్న

సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ అంటే క్రేజ్. ఏ చిన్న అవకాశం వచ్చినా రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని చూస్తారు. అలాంటిది తమన్నకు బాలీవుడ్ నుంచి బంగారం లాంటి ఆఫర్ వచ్చింది. సూపర్ హిట్ హిమ్మత్ వాలాలో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ అది. దీంతో ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అంచనా వేశారు. కట్ చేస్తే, హిమ్మత్ వాలా డిజాస్టర్ అయింది. తమన్న ఆశలకు గండిపడింది. బాలీవుడ్ […]

Advertisement
Update: 2020-05-08 20:30 GMT

సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్ అంటే క్రేజ్. ఏ చిన్న అవకాశం వచ్చినా రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని చూస్తారు. అలాంటిది తమన్నకు బాలీవుడ్ నుంచి బంగారం లాంటి ఆఫర్ వచ్చింది. సూపర్ హిట్ హిమ్మత్ వాలాలో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ అది. దీంతో ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అంచనా వేశారు.

కట్ చేస్తే, హిమ్మత్ వాలా డిజాస్టర్ అయింది. తమన్న ఆశలకు గండిపడింది. బాలీవుడ్ లో ఏకంగా ఐరెన్ లెగ్ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇన్నేళ్లకు ఆ సినిమా ఫ్లాప్ పై స్పందించింది తమన్న. హిమ్మత్ వాలా డిజాస్టర్ అవ్వడం తన కెరీర్ కు పెద్ద దెబ్బగా చెప్పుకొచ్చింది.

కెరీర్ లో ఎన్నో ఫ్లాపులు చూసింది తమన్న. కానీ ఆమెకెప్పుడూ అవకాశాలు తగ్గలేదు. ఇన్ని ఫ్లాపులొచ్చినా తెలుగు, తమిళ భాషల్లో ఆమె కొనసాగుతూనే ఉంది. కానీ బాలీవుడ్ లో హిమ్మత్ వాలా ఫ్లాప్ ను మాత్రం జీర్ణించుకోలేకపోయానంటోంది మిల్కీబ్యూటీ.

నిజానికి ఆ టైమ్ లో ఒకేసారి 4-5 సినిమాలు చేస్తోంది తమన్న. ఏ సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా ఆమెకు అనవసరం. కానీ హిమ్మత్ వాలా విషయంలో మాత్రం ఆమె అలా ఆలోచించలేదు. ఎందుకంటే ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా పరాజయం తర్వాత ఏ సినిమాల రిజల్ట్ పై పెద్దగా దృష్టి పెట్టడం మానేశానంటోంది మిల్కీబ్యూటీ.

Tags:    
Advertisement

Similar News