కరోనాపై అపోహలు " వాస్తవాలు

కరోనా… ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. అత్యంత వేగంగా దేశాలను చుట్టేస్తున్న ఈ డెవిల్ వైరస్‌పై జనాల్లో అపోహలున్నాయి. అనుమానాలున్నాయి. అలాగే రోజుకో పుకారు షికారు చేస్తోంది. వేడి వాతావరణంలో వ్యాపించదని… కోల్డ్ వెదర్‌లో విజృంభిస్తుందని… ఇలా పలు రకాలుగా కరోనాపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమేనన్న అపోహతో జనం వాటిని ఫాలో అవుతూ కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అసలు కరోనా వైరస్ ఎలా చస్తుంది… ఎక్కడ బతుకుతుంది… ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపిస్తుంది… […]

Advertisement
Update: 2020-03-22 23:50 GMT

కరోనా… ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. అత్యంత వేగంగా దేశాలను చుట్టేస్తున్న ఈ డెవిల్ వైరస్‌పై జనాల్లో అపోహలున్నాయి. అనుమానాలున్నాయి. అలాగే రోజుకో పుకారు షికారు చేస్తోంది.

వేడి వాతావరణంలో వ్యాపించదని… కోల్డ్ వెదర్‌లో విజృంభిస్తుందని… ఇలా పలు రకాలుగా కరోనాపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమేనన్న అపోహతో జనం వాటిని ఫాలో అవుతూ కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కానీ అసలు కరోనా వైరస్ ఎలా చస్తుంది… ఎక్కడ బతుకుతుంది… ఎలాంటి పరిస్థితుల్లో వ్యాపిస్తుంది… అన్నదానిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పక్కా క్లారిటీ ఇచ్చింది.

అపోహ : ఎలాంటి వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుంది..? వేడి కానీ చల్లని వాతావరణంలో ఉంటే కరోనా వైరస్‌ చచ్చిపోతుందా..? గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కరోనా వ్యాప్తి చెందదా..?

వాస్తవం : ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి, COVID-19 వైరస్ హాట్ అండ్ కోల్డ్ వెదర్‌తో సహా అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుంది. అసలు వాతావరణంతో సంబంధం లేకుండా కొవిడ్ 19 సింప్టమ్స్ మీకు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం వద్దు.

చల్లని వాతావరణం కొత్త కరోనావైరస్ ను చంపగలదని నమ్మడానికి ఎటువంటి రీజన్ లేదు. కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత సురక్షితమైన మార్గం చేతులను తరచుగా శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్ర పరుచుకోవడమే..

అపోహ: వేడి నీళ్లతో స్నానం చేస్తే కరోనా వైరస్ రాదు… అది చచ్చిపోతుంది

వాస్తవం: వేడిస్నానం చేస్తే కొవిడ్ 19 చచ్చిపోతుందన్నది అపోహ మాత్రమే. మామూలుగానే మన బాడీ సాధారణ ఉష్ణోగ్రత 36.5 నుంచి 37 డిగ్రీల వరకు ఉంటుంది. అయినా కరోనా వైరస్ మన బాడీలోకి ప్రవేశిస్తోంది. ఈ ఉష్ణోగ్రత దాటి ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే మనకే హానికరం. కాబట్టి కరోనా మన బాడీలోకి వెళ్లకుండా ఉండాలంటే… చేతులతో కళ్లు, ముక్కును నలుముకోకూడదు.

అపోహ : కరోనా వైరస్ దోమ కాటుతో వ్యాప్తి చెందుతుందా..?

వాస్తవం: ఇది ముమ్మాటికీ తప్పు. కొత్త కరోనా వైరస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందదు. దోమ కాటుతో వస్తుందన్నదానికి ఇప్పటి వరకు ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది.

కరోనా అనేది శ్వాసకోశ వైరస్, ఇది ప్రధానంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పడే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు… కర్చీఫ్ ను అడ్డుపెట్టుకోవడం కానీ, మోచేయి అడ్డుపెట్టుకోవడం కానీ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే సామాజిక దూరం కూడా పాటించాలని చెబుతున్నారు.

అపోహ: కరోనావైరస్‌ను చంపడంలో హ్యాండ్ డ్రైయర్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయా..

వాస్తవం: ఇది నిజం కాదు…కొవిడ్ 19ను హ్యాండ్‌ డ్రైయర్స్ ద్వారా నివారించలేము. ఈ మహమ్మారిని నివారించాలంటే మీ చేతులు శుభ్రం చేసిన తర్వాత ఉపయోగించిన టవల్స్‌ను పూర్తిగా ఆరబెట్టాలి.

అపోహ: ఆల్ట్రావైలెంట్‌ డిసిన్‌ఫెక్షన్‌ ల్యాంప్‌లతో కరోనా వైరస్‌ను చంపగలమా..?

వాస్తవం: ఇది నిజం కాదు…వీటి నుంచి వచ్చే UV రేడియషన్‌ మన చర్మానికి చికాకు తెప్పిస్తాయి. మన శరీరంపై వైరస్ చంపేందుకు యూవీ బల్బ్‌లను అస్సలు ఉపయోగించకూడదు.

అపోహ: కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను గుర్తించడంలో ధర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయా..?

వాస్తవం: ఇది నిజం. వైరస్ కారణంగా జ్వరం వచ్చిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్ల పాత్ర కీలకం. సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే..ఇవి తప్పకుండా కనిపెడతాయి. అయితే వైరస్ బారిన పడిన తర్వాత 2 నుంచి 10రోజుల మధ్య ఈ లక్షణాలు బయట పడుతుండడంతో కరోనా బాధితులను త్వరగా గుర్తించలేకపోతున్నాము.

అపోహ: శరీరంపై ఆల్కహాల్ లేదా క్లోరిన్ స్ప్రే చేయడం వల్ల కరోనా వరైస్‌ను చంపగలమా..

వాస్తవం: ఇది ఏమాత్రం నిజం కాదు. శరీరంపైన ఆల్కహాల్‌ లేక క్లోరిన్ స్ప్రే చేసినంత మాత్రాన శరీరం లోపలకు వెళ్లిన వైరస్ చావదు. ఇది అపోహ మాత్రమే. అయితే శరీరంపైన ఏమైనా క్రిములు ఉంటే ఆల్కహాల్, క్లోరిన్ రెండు ఉపయోగపడతాయి. అయితే వైద్యుల సిఫారసు మేరకే యూజ్ చేయాల్సి ఉంటుంది.

అపోహ: న్యూమోనియాకు ఉపయోగించే వ్యాక్సిన్లు కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయా..

వాస్తవం: ఇది నిజం కాదు. న్యుమోనియాకు వ్యతిరేకంగా యూజ్ చేసే న్యూమోకాకల్ వ్యాక్సిన్, హేమోఫిలస్ ఎంజా టైప్‌ బీ టీకా కొత్త వైరస్‌ను నియంత్రించలేవు.

కరోనా చాలా భిన్నమైనది.. దీనికి సొంత టీకా అవసరం. ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉపయోగించే వ్యాక్సిన్ వేయడం మంచిది.

అపోహ: ముక్కును నిరంతరం సెలైన్‌తో శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందగలమా..?

వాస్తవం: ఇది నిజం కాదు. నిరంతరం సెలైన్‌తో ముక్కును శుభ్రం చేసుకుంటే కరోనా వ్యాప్తి చెందదు అన్నదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే జలుబు వచ్చినప్పుడు ముక్కును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటే ఉపశమనం పొందవచ్చనడానికి పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయి.

అపోహ: వెల్లుల్లి తినడం వల్ల కరోనావైరస్ సంక్రమణను నివారించగలదా?

వాస్తవం: వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం, ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే వెల్లుల్లి వైరస్‌ను అడ్డుకుంటాయనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు.

అపోహ: కరొనా వైరస్ ఎక్కువగా ఏ వయసు వారిపై ప్రభావం చూపుతుంది..?

వాస్తవం: కరోనా అన్ని వయసుల వారికి సోకుతుంది. అయితే వృద్ధులకు ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి ఉంటే కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అన్ని వయసుల వారు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చు.

అపోహ: కరోనాను యాంటిబయాటిక్స్‌తో నియంత్రించవచ్చా..?

వాస్తవం: ఇది నిజం కాదు. యాంటిబయటిక్స్ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేయవు. అవి బ్యాక్టీరియాను మాత్రమే నియంత్రించగలవు. కరోనా అన్నది వైరస్ కాబట్టి యాంటిబయాటిక్స్ చికిత్సకు ఉపయోగపడవు..

అపోహ: కరోనాను కట్టడి చేయడానికి నిర్దిష్ట మందులు ఉన్నాయా..?

వాస్తవం: ఇప్పటి వరకు కరోనాను నివారించడానికి స్పెసిఫిక్ మెడిసిన్ లేదని WHO స్పష్టం చేసింది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా వైరస్‌ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News