మన దేశంలో కరోనాతో ఐదో మరణం

భారత దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటివరకూ నలుగురు కరోనా కారణంగా చనిపోగా శుక్రవారం మరొకరు ఈ కరోనాకు బలి అయ్యారు. దేశంలో స్టేజ్ లు దాటుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ధాటికి ఇప్పుడు అంతా ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు చనిపోయారు. తాజాగా ఐదో ప్రాణం పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్-19 కారణంగా ఐదుగురు […]

Advertisement
Update: 2020-03-20 04:27 GMT

భారత దేశంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటివరకూ నలుగురు కరోనా కారణంగా చనిపోగా శుక్రవారం మరొకరు ఈ కరోనాకు బలి అయ్యారు. దేశంలో స్టేజ్ లు దాటుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ధాటికి ఇప్పుడు అంతా ఇళ్లలోంచి బయటకు రావడం లేదు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా నలుగురు చనిపోయారు. తాజాగా ఐదో ప్రాణం పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్-19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.

అయితే ఈ మరణించిన టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 190కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై హైఅలెర్ట్ ప్రకటించి వ్యాప్తి చెందకుండా అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2.20 లక్షలు దాటగా మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది.

Tags:    
Advertisement

Similar News