నిర్భయ దోషులకు ఉరి రేపే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను రేపు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు కొట్టేసింది. దీంతో గతంలో నిర్ణయించిన మేరకే రేపు ఉదయం ఉరి శిక్ష అమలు కానుంది. నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. దోషులు ఒకరి తర్వాత ఒకరు […]

Advertisement
Update: 2020-03-19 05:37 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను రేపు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు కొట్టేసింది. దీంతో గతంలో నిర్ణయించిన మేరకే రేపు ఉదయం ఉరి శిక్ష అమలు కానుంది.

నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. దోషులు ఒకరి తర్వాత ఒకరు క్షమాభిక్ష పిటిషన్, క్యూరేటీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ అంటూ శిక్షను వాయిదా వేయిస్తూ వచ్చారు. ఆ పిటిషన్లనీ కొట్టివేయబడ్డాయి. చివరకు కేసులో ఒక దోషి అక్షయ్ కుమార్ రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని కోర్టులో సవాలు చేశారు. కాని ఆ పిటిషన్ కూడా ఇవాళ కోర్టు తిరస్కరించడంతో ఉరి శిక్ష అమలుకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి.

తీహార్ జైల్లో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయనున్నారు. ఇప్పటికే తీహార్ జైలు అధికారులు, తలారి పవన్ కలిసి ఇసుక బస్తాలతో ట్రయల్ నిర్విహించారు. రేపు ఉదయం దోషులైన ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలకు ఉరి శిక్ష అమలు కానుంది. 2012 డిసెంబర్ 12న నిర్భయపై అఘాయిత్యం జరగగా…. ఎనిమిదేళ్ల తర్వాత దోషులకు శిక్ష అమలవుతోంది.

Tags:    
Advertisement

Similar News