తనకు అవార్డు వచ్చిన వార్తను తానే చదువుకున్న న్యూస్ యాంకర్... తర్వాత ఏమయ్యింది..?

ఎవరైనా తాము చేసే పనిలో గుర్తింపు రావాలని అనుకుంటారు. కాస్త సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లైతే అవార్డులను ఆశించడం తప్పుకాదు. కాని ఆ అవార్డు వచ్చిన సంగతి ఎవరైనా చెబితే అప్పుడు వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే ఒక న్యూస్ యాంకర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. అయితే అది ఎవరూ ఆమెకు చెప్పలేదు. కాని ఏకంగా తనకు అవార్డు వచ్చిన వార్తను తానే లైవ్‌లో చదువుకొని.. తన పేరు ఉందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. […]

Advertisement
Update: 2020-02-13 03:30 GMT

ఎవరైనా తాము చేసే పనిలో గుర్తింపు రావాలని అనుకుంటారు. కాస్త సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లైతే అవార్డులను ఆశించడం తప్పుకాదు. కాని ఆ అవార్డు వచ్చిన సంగతి ఎవరైనా చెబితే అప్పుడు వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే ఒక న్యూస్ యాంకర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది.

అయితే అది ఎవరూ ఆమెకు చెప్పలేదు. కాని ఏకంగా తనకు అవార్డు వచ్చిన వార్తను తానే లైవ్‌లో చదువుకొని.. తన పేరు ఉందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే….

కేరళ నుంచి పని చేసే మాతృభూమీ న్యూస్ అనే ఛానల్‌లో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పని చేసే శ్రీజా శ్యామ్ అనే మహిళకు 2018వ సంవత్సరానికి గాను బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు దక్కించుకుంది. కేరళ ప్రభుత్వం బుధవారం ఈ అవార్డులు ప్రకటించింది.

అయితే మాతృభూమి ఛానెల్‌కు ఈ వార్త తెలిసినా శ్రీజకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు లైవ్ న్యూస్ నువ్వే చదవాలంటూ ఆన్ ఎయిర్‌కు పంపించారు. ఆమె వార్తలు చదివే సమయంలో మధ్యలో ఈ వార్తను కూడా వేసేశారు. దాంతో తనకు అవార్డు వచ్చిన వార్తను తానే చదువుకుంటూ.. అనందంతో కూడిన నవ్వును ప్రదర్శిస్తూ.. కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఏ మాత్రం తడబడకుండా మిగతా వార్తలు చదివేసింది.

అలా తన అవార్డు వార్తను తానే లైవ్‌లో చదువుకున్న శ్రీజ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీజ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని నెటిజన్లు ఆమెను ఎంతో పొగుడుతున్నారు.

Sreeja Shyam അല്പസമയം മുൻപ് വാർത്തവായിക്കുന്നതിനിടയിൽ: മികച്ച വാർത്താ അവതാരകയ്‌ക്കുള്ള സംസ്ഥാന സർക്കാർ പുരസ്കാരം മാതൃഭൂമി ന്യൂസിലെ ചീഫ്‌ സബ് എഡിറ്റർ എൻ. ശ്രീജയ്‌ക്ക് ലഭിച്ചു.വാർത്ത കാണുന്നവർ : ആരാണയാൾ?അൽ ശ്രീജ : ഞാനാണയാൾ ???* * *കൺഗ്രാാറ്റ്സ് മുത്തുമണ്യേ… ?????

Publiée par Habeeb Anju sur Mardi 11 février 2020

Tags:    
Advertisement

Similar News