భారత కుర్రాళ్లకు సీనియర్ల ఆల్ ద బెస్ట్

ప్రపంచకప్ తో తిరిగిరావాలంటూ శుభాకాంక్షలు సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్స్ కు చేరుకొన్న భారత కుర్రాళ్లకు పలువురు సీనియర్ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియం గర్గ్ నాయకత్వంలోని భారతజట్టు ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగి రావాలని శుభసందేశాలు పంపారు. పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా మరికొద్దిగంటల్లో జరిగే టైటిల్ సమరంలో బంగ్లాదేశ్ తో భారత కుర్రాళ్లు తలపడనున్నారు. లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకూ తిరుగులేని విజయాలు సాధించిన భారత యంగ్ గన్స్… ఐదోసారి […]

Advertisement
Update: 2020-02-08 00:00 GMT
  • ప్రపంచకప్ తో తిరిగిరావాలంటూ శుభాకాంక్షలు

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్స్ కు చేరుకొన్న భారత కుర్రాళ్లకు పలువురు సీనియర్ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియం గర్గ్ నాయకత్వంలోని భారతజట్టు ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగి రావాలని శుభసందేశాలు పంపారు.

పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా మరికొద్దిగంటల్లో జరిగే టైటిల్ సమరంలో బంగ్లాదేశ్ తో భారత కుర్రాళ్లు తలపడనున్నారు. లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకూ తిరుగులేని విజయాలు సాధించిన భారత యంగ్ గన్స్… ఐదోసారి ప్రపంచకప్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.

1988 నుంచి 2018 వరకూ జరిగిన 12 జూనియర్ ప్రపంచకప్ టోర్నీలలో ఏడోసారి ఫైనల్స్ ఆడబోతున్న ఏకైకజట్టు భారత్ మాత్రమే కావడం విశేషం.

గతంలో … మహ్మద్ కైఫ్ ( 2000 ), విరాట్ కొహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృధ్వీ షాల నాయకత్వంలో ప్రపంచకప్ టైటిల్స్ నెగ్గిన భారత్… రెండేసి సార్లు రన్నరప్, తృతీయ స్థానాలలో నిలిచింది.

గత మూడు ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా ఫైనల్స్ చేరుతూ వచ్చిన భారత్… సూపర్ సండే టైటిల్ ఫైట్ లో బంగ్లాదేశ్ పై హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

భారత కుర్రాళ్లు తమ సహజసిద్ధమైన ఆటతీరుతో ప్రపంచకప్ కోసం పోరాడాలని వీడియో సందేశాల ద్వారా సీనియర్ స్టార్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పూజారా, వృద్ధిమాన్ సాహా, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఆకాక్షించారు.

మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కొహ్లీ నాయకత్వంలోని సీనియర్ జట్టు సభ్యులు సైతం తమతమ శుభ సందేశాలను పంపారు.

ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో పాకిస్తాన్ ను భారత్ 10 వికెట్లతో చిత్తు చేస్తే… రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ అలవోక విజయం సాధించింది.

భారత్ కు ఇది 7వ ప్రపంచకప్ ఫైనల్స్ కాగా… బంగ్లాదేశ్ కు ఇదే తొలి ప్రపంచకప్ ఫైనల్స్ కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News