జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్‌ బై

సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్‌ బై చెప్పాడు. సినిమాల్లో నటించను, ప్రజాసేవే ముఖ్యం అని చెప్పిన పవన్ ఇప్పుడు మళ్లీ క్లాప్ కొట్టడం జేడీలో అసంతృప్తిని తీసుకొచ్చినట్లు ఆయన లేఖ ద్వారా తెలుస్తోంది. నిలకడ లేని నిర్ణయాలతో ముందుకెళ్తున్న పవన్‌తో కలిసి నడవడం కష్టమని భావించి.. జనసేన నుంచి బయటకి వస్తున్నట్లు లేఖలో తెలియజేశాడు లక్ష్మీనారాయణ. పార్లమెంట్‌ ఎన్నికల టైమ్‌లో చివరి నిమిషంలో లక్ష్మీనారాయణ జనసేననలో చేరాడు. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు… […]

Advertisement
Update: 2020-01-30 09:24 GMT

సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్‌ బై చెప్పాడు. సినిమాల్లో నటించను, ప్రజాసేవే ముఖ్యం అని చెప్పిన పవన్ ఇప్పుడు మళ్లీ క్లాప్ కొట్టడం జేడీలో అసంతృప్తిని తీసుకొచ్చినట్లు ఆయన లేఖ ద్వారా తెలుస్తోంది. నిలకడ లేని నిర్ణయాలతో ముందుకెళ్తున్న పవన్‌తో కలిసి నడవడం కష్టమని భావించి.. జనసేన నుంచి బయటకి వస్తున్నట్లు లేఖలో తెలియజేశాడు లక్ష్మీనారాయణ.

పార్లమెంట్‌ ఎన్నికల టైమ్‌లో చివరి నిమిషంలో లక్ష్మీనారాయణ జనసేననలో చేరాడు. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు… ఓడిపోయాడు. అయితే ఆతర్వాత జనసేన కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నాడు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయనకు ఆహ్వానం లేకుండా పోయింది.

ఇటీవల బీజేపీతో కలిసి నడుద్దామని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నాడు. పార్టీలో కీలక నిర్ణయాలపై కూడా లక్ష్మీనారాయణకు సమాచారం ఇవ్వలేదట. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ ఇవాళ జనసేనకు రాజీనామా చేశాడు.

పవన్‌ నిలకడైన రాజకీయాలు చేయడం లేదని లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో ఘాటుగా విమర్శించాడు. రాజకీయాల్లో పూర్తి కాలం ఉంటానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌..ఇప్పుడు సినిమాల్లో నటించి ప్రజలకు ఇచ్చిన మాట తప్పాడని లక్ష్మీనారాయణ అన్నాడు. పవన్‌ కల్యాణ్‌ నిలకడగా లేకపోవడం వల్ల తాను జనసేన నుంచి నిష్క్రమిస్తున్నట్లు లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నాడు.

మొత్తానికి జనసేనకు ఇప్పటికే కీలక నేతలు దూరమయ్యారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్‌ తప్ప వేరే ఏ నేత కూడా పార్టీలో లేరు.

Tags:    
Advertisement

Similar News