రాజీనామా గుట్టు విప్పిన డొక్కా మాణిక్య వరప్రసాద్

తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తీరుపై స్పందించారు. తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ ఆలోచన.. తన వ్యక్తిగత ఆలోచనకు భిన్నంగా ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇదే విషయమై తెలుగు దేశం పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ.. 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ విషయంలో మాత్రమే.. ప్రస్తుతం రాజకీయంగా […]

Advertisement
Update: 2020-01-30 09:06 GMT

తెలుగుదేశం నేత డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తీరుపై స్పందించారు. తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ ఆలోచన.. తన వ్యక్తిగత ఆలోచనకు భిన్నంగా ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే తాను ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఇదే విషయమై తెలుగు దేశం పార్టీలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ.. 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ విషయంలో మాత్రమే.. ప్రస్తుతం రాజకీయంగా రచ్చ జరుగుతోంది.

కానీ.. డొక్కామాణిక్య వరప్రసాద్ మాత్రం.. ఏ విషయాన్నీ చెప్పకుండా.. తన ఆలోచన, పార్టీ ఆలోచన వేరుగా ఉంటోందని చెప్పి.. తన రాజీనామాపై జరుగుతున్న చర్చను మరి కాస్త కదిలించారు.

అక్కడితో ఆగకుండా.. మండలి రద్దుపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల కోసం త్వరలో పోరాటం చేస్తానని అన్నారు. మిగతా విషయాలన్నీ త్వరలో తెలుస్తాయని చెప్పారు. ఆ మిగతా విషయాలు ఏంటన్నదే.. అందరిలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News