ఇండియాలో బెస్ట్ సీఎంలు.... జగన్ ఏ ప్లేస్ లో ఉన్నారంటే...

ఏపీ సీఎం జగన్…ఇప్పుడు దేశంలో మార్మోగుతున్న పేరు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి… నిత్యం హెడ్ లైన్స్ లో నిలుస్తున్న ముఖ్యమంత్రి. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే….సీఎంగా తనకంటూ ఓ సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరు బెస్ట్ సీఎం అన్న సర్వేలో జగన్ ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారు. దేశంలో ఎవరు బెస్ట్ సీఎం…అన్న దానిపై మూడ్ ఆఫ్ ది స‌ర్వే పేరుతో ఇండియా టుడ్ స‌ర్వే చేసింది. […]

Advertisement
Update: 2020-01-25 00:42 GMT

ఏపీ సీఎం జగన్…ఇప్పుడు దేశంలో మార్మోగుతున్న పేరు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి… నిత్యం హెడ్ లైన్స్ లో నిలుస్తున్న ముఖ్యమంత్రి.

ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే….సీఎంగా తనకంటూ ఓ సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరు బెస్ట్ సీఎం అన్న సర్వేలో జగన్ ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారు.

దేశంలో ఎవరు బెస్ట్ సీఎం…అన్న దానిపై మూడ్ ఆఫ్ ది స‌ర్వే పేరుతో ఇండియా టుడ్ స‌ర్వే చేసింది. అందులో టాప్ 10 సీఎంలలో జగన్ నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుల కెక్కాడు.

‘దేశ్‌ కా మూడ్’ పేరుతో వీడీపీ అసోసియేట్స్-ఇండియా టుడే నిర్వహించిన ఓ సర్వేలో జగన్ మోహన్ రెడ్డి.. నాలుగో స్థానంలో నిలిచారు. లిస్టులో యోగి ఆధిత్యనాథ్ అందరికంటే ముందున్నారు. తర్వాత స్థానాల్లో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు.

మూడ్ ఆఫ్ ది నేష‌న్‌ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 11,252 మంది పాల్గొన్నట్టు ఆ సంస్థ తెలిపింది. అందులో ఓటర్లు 10,098 మంది. మొత్తం 14 రాష్ట్రాల్లో సర్వే చేశారు. మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు నవరత్నాలు పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి పనితీరు మీద ప్రజలు ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News