విరాట్ ను ఊరిస్తున్న మరో ప్రపంచ రికార్డు

కెప్టెన్ గా 41 సెంచరీలతో పాంటింగ్ సరసన కొహ్లీ భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ మరో ప్రపంచ రికార్డుకు గురిపెట్టాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 41 శతకాలు బాదిన కెప్టెన్ గా రికీ పాంటింగ్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించడానికి విరాట్ ఉరకలేస్తున్నాడు. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి….రికీ పాంటింగ్ కు కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లో 41 శతకాలు బాదిన రికార్డు ఉంది. విరాట్ […]

Advertisement
Update: 2020-01-14 01:10 GMT
  • కెప్టెన్ గా 41 సెంచరీలతో పాంటింగ్ సరసన కొహ్లీ

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ మరో ప్రపంచ రికార్డుకు గురిపెట్టాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 41 శతకాలు బాదిన కెప్టెన్ గా రికీ పాంటింగ్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించడానికి విరాట్ ఉరకలేస్తున్నాడు.

టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి….రికీ పాంటింగ్ కు కెప్టెన్ గా 376 ఇన్నింగ్స్ లో 41 శతకాలు బాదిన రికార్డు ఉంది. విరాట్ కొహ్లీకి మాత్రం… కేవలం 196 ఇన్నింగ్స్ లోనే 40 సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్ లోని మూడుమ్యాచ్ ల్లో…కొహ్లీ ఒక్క సెంచరీ సాధించినా…రికీ పాంటింగ్ పేరుతో ఉన్నప్రపంచ రికార్డును అధిగమించడంతో పాటు …సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం లేకపోలేదు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన డే-నైట్ టెస్టులో కొహ్లీ శతకం సాధించడం ద్వారా కెప్టెన్ గా 41 సెంచరీల పాంటింగ్ ప్రపంచ రికార్డును సమం చేయగలిగాడు.

కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఇప్పటి వరకూ సాధించిన 41 సెంచరీలలో 21 వన్డే, 20 టెస్టు శతకాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News