మహా ట్విస్ట్.... డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఇవ్వాళ ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత బలసమీకరణలు ఊపందుకున్నాయి. రేపటి ఫ్లోర్ టెస్ట్‌లో గెలుపు మాదేనని ధీమాగా ఉన్న బీజేపీకి ఎన్సీపీ నేత అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. తమకు ఎన్సీపీ మద్దతు ఉందని చెప్పి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అజిత్ ఇచ్చిన షాక్‌కు ఎన్సీపీ అధినేత ఆయనను […]

Advertisement
Update: 2019-11-26 04:07 GMT

మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఇవ్వాళ ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత బలసమీకరణలు ఊపందుకున్నాయి. రేపటి ఫ్లోర్ టెస్ట్‌లో గెలుపు మాదేనని ధీమాగా ఉన్న బీజేపీకి ఎన్సీపీ నేత అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. తమకు ఎన్సీపీ మద్దతు ఉందని చెప్పి సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

అజిత్ ఇచ్చిన షాక్‌కు ఎన్సీపీ అధినేత ఆయనను శాసనసభా పక్ష నేత పదవి నుంచి తప్పించామని ప్రకటించారు. కాని పార్టీలో అలాగే కొనసాగించారు. ఇక రేపు బలపరీక్షలో బీజేపీ నెగ్గుతుందని.. అజిత్ పవార్ తన వర్గ ఎమ్మెల్యేల మద్దతుతో గట్టెక్కుతుందని అందరూ భావించారు.

ఈ సమయంలోనే అజిత్ పవార్ తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శరద్ పవార్ భార్య, అల్లుడు తీవ్రమైన ఒత్తిడి చేయడంతోనే అజిత్ రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అజిత్ రాజీనామాతో సీఎం ఫడ్నవీస్ కూడా పునరాలోచనలో పడ్డారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని సమాచారం. ఆయన కూడా సీఎం పదవికి రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News