మద్దతు కోసం కన్నా వద్దకు నేతలను పంపిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరిగి తన చుట్టూ గుంపును తయారు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జనసేనతో మంచి సంబంధాలను పునరుద్దరించుకున్న చంద్రబాబు… తాజాగా బీజేపీతో పరిచయాలు పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తా … ప్రసక్తే లేదు అని బీజేపీ నేతలు అంటున్నా బాబు మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. ఇసుకపై కొన్ని గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు… తన దీక్షకు బీజేపీ మద్దతు కోరారు. దీక్షకు మద్దతు ఇచ్చేలా […]

Advertisement
Update: 2019-11-11 06:50 GMT

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరిగి తన చుట్టూ గుంపును తయారు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇప్పటికే జనసేనతో మంచి సంబంధాలను పునరుద్దరించుకున్న చంద్రబాబు… తాజాగా బీజేపీతో పరిచయాలు పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తా … ప్రసక్తే లేదు అని బీజేపీ నేతలు అంటున్నా బాబు మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు.

ఇసుకపై కొన్ని గంటల పాటు దీక్ష చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు… తన దీక్షకు బీజేపీ మద్దతు కోరారు. దీక్షకు మద్దతు ఇచ్చేలా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఒప్పించేందుకు ఆలపాటి రాజా ఆధ్వర్యంలో బృందాన్ని చంద్రబాబు పంపించారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆలపాటి రాజా కోరారు.

ప్రజాసమస్యలపై ఎవరు పోరాటం చేసినా తమ మద్దతు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. నేరుగా దీక్షలో పాల్గొనే విషయంలో మాత్రం కన్నా స్పష్టత ఇవ్వలేదు. దానికి కారణం… చంద్రబాబుతో స్నేహానికి కన్నా సిద్ధంగా ఉన్నా… పార్టీలోని ప్రముఖులు కన్నాను తరచూ మందలిస్తూ ఉండడంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

టీడీపీ నేతల బృందం రాయబారానికి వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కన్నా… టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని మరోసారి తేల్చిచెప్పారు.

Tags:    
Advertisement

Similar News