పిల్లాడిని హింసించిన అపార్ట్‌మెంట్‌వాసి... కేసు నమోదు
హైదరాబాద్ అల్వాల్‌లో ఒక వ్యక్తి విచక్షణ మరిచి ప్రవర్తించాడు. అపార్ట్మెంట్ లో ఉంటున్న మరో వ్యక్తి కుమారుడిని విచక్షణా రహితంగా కొట్టి హింసించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న పలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అల్వాల్‌లోని సువర్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు ఏడేళ్ల జయంత్ సైకిల్‌తో ఆడుకుంటుండగా… కారుకు అడ్డు వచ్చాడంటూ అపార్ట్మెంట్లోనే […]
హైదరాబాద్ అల్వాల్‌లో ఒక వ్యక్తి విచక్షణ మరిచి ప్రవర్తించాడు. అపార్ట్మెంట్ లో ఉంటున్న మరో వ్యక్తి కుమారుడిని విచక్షణా రహితంగా కొట్టి హింసించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న పలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
అల్వాల్‌లోని సువర్ణ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు ఏడేళ్ల జయంత్ సైకిల్‌తో ఆడుకుంటుండగా… కారుకు అడ్డు వచ్చాడంటూ అపార్ట్మెంట్లోనే ఉంటున్న క్రాంతి స్వరూప్ ఇష్టమొచ్చినట్టు కొట్టాడు.
దెబ్బలకు తట్టుకోలేక పిల్లాడు ఏడ్చినా శాంతించలేదు. పిల్లాడిని వెంటపడి మరీ కొట్టాడు. ఎత్తి కిందపడేశాడు. తర్వాత లిఫ్ట్‌లోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టాడు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యారు. వాటి ఆధారంగా బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్రాంతి స్వరూప్‌పై కేసు నమోదు చేశారు.