పురుషుడి వివాహ వయసును తగ్గించే యోచనలో కేంద్రం

పురుషుడి వివాహ వయసును తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వివాహానికి సంబంధించి చట్టబద్దమైన వయసు అర్హతను స్త్రీ పురుషులకు సమం చేయబోతున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం పురుషుడి వివాహ వయసు 21 ఏళ్లు, స్త్రీ వివాహ అర్హత వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇలా ఇద్దరికి వేరువేరు వయసును అర్హతగా ఉంచడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బాల్య వివాహ నిషేధ చట్టంలో సవరణపై ఇటీవల నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో […]

Advertisement
Update: 2019-10-30 19:57 GMT

పురుషుడి వివాహ వయసును తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వివాహానికి సంబంధించి చట్టబద్దమైన వయసు అర్హతను స్త్రీ పురుషులకు సమం చేయబోతున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం పురుషుడి వివాహ వయసు 21 ఏళ్లు, స్త్రీ వివాహ అర్హత వయసు 18 ఏళ్లుగా ఉంది.

ఇలా ఇద్దరికి వేరువేరు వయసును అర్హతగా ఉంచడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బాల్య వివాహ నిషేధ చట్టంలో సవరణపై ఇటీవల నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.

18 ఏళ్లకే వివాహం చేసుకునే అర్హతను స్త్రీలకు ఇచ్చి… పురుషులు మాత్రం 21 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదు అనడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న ఉంది. కేవలం పురుషుడు సంసార బాధ్యతలను మోయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అతడి వయసును అధికంగా ఉంచారన్న విమర్శ ఉంది. లైంగిక పరమైన కోణంలో కాకుండా బాధ్యతల కోణంలో ఇలా వయసును నిర్ధారించడం సరికాదన్న వాదన ఉంది.

18 ఏళ్లకు మేజర్‌గా ఒక వ్యక్తిని గుర్తిస్తున్నప్పుడు, ఓటు హక్కు కూడా ఇస్తున్నప్పుడు ఆ వయసులో అతడు వివాహం మాత్రం చేసుకోకూడదని ఆంక్షలు పెట్టడం సరికాదన్న అభిప్రాయం ఉంది.

వేరువేరు వయసులు అర్హతగా ఉంచడం అన్నది పితృస్వామ్య వ్యవస్థలోని ఆధిపత్యాన్ని సూచిస్తోందని… భార్య కంటే భర్త పెద్దగా ఉండాలన్న భావన అందులోనిదే అన్న విమర్శ కూడా ఉంది.

Tags:    
Advertisement

Similar News