చెత్త ఎత్తబోయాడు.... 10 అడుగుల కొండచిలువ చుట్టేసింది....

భువనచంద్రన్ నాయర్ అనే 58 ఏళ్ల వృద్ధుడిని తిరువనంతపురంలోని ఒక కళాశాల ప్రాంగణంలో కొండచిలువ చుట్టేసింది. చావు అంచుల వరకు వెళ్లిన అతడిని సహచర పనివాళ్లు రక్షించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ వర్క్‌ స్కీమ్‌లో భాగంగా మైదానాలను శుభ్రపరిచేందుకు 58 ఏళ్ల భువనచంద్రన్… మరికొంత మంది కార్మికులతో పాటు, తిరువనంతపురంలోని ‘కేరళ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ క్యాంపస్ లో చెత్తా చెదారం తొలగించి, చిన్నా చితక మొక్కలను పీకి వేసే పనిలో ఉన్నాడు. అతడికి ఒక మచ్చల వస్త్రం లాంటిది […]

Advertisement
Update: 2019-10-17 03:21 GMT

భువనచంద్రన్ నాయర్ అనే 58 ఏళ్ల వృద్ధుడిని తిరువనంతపురంలోని ఒక కళాశాల ప్రాంగణంలో కొండచిలువ చుట్టేసింది. చావు అంచుల వరకు వెళ్లిన అతడిని సహచర పనివాళ్లు రక్షించారు.

ఎంఎన్‌ఆర్‌ఇజిఎ వర్క్‌ స్కీమ్‌లో భాగంగా మైదానాలను శుభ్రపరిచేందుకు 58 ఏళ్ల భువనచంద్రన్… మరికొంత మంది కార్మికులతో పాటు, తిరువనంతపురంలోని ‘కేరళ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ క్యాంపస్ లో చెత్తా చెదారం తొలగించి, చిన్నా చితక మొక్కలను పీకి వేసే పనిలో ఉన్నాడు. అతడికి ఒక మచ్చల వస్త్రం లాంటిది కనిపించింది. దాన్ని తీసివేయాలని దగ్గరకు వెళ్లాడు.

తీరా దగ్గరికి పోయిన తర్వాత చూస్తే అది 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ అని తేలింది. వెంటనే తోటి పనివాళ్లను పిలిచాడు. వాళ్లు పామును పట్టుకుని, ఒక సంచిలో వేసి, ఆ ప్రాంతం నుండి తొలగించాలని నిర్ణయించుకున్నారు.

భువనచంద్రన్ దానిని ఒక సంచిలో ఉంచడానికి ప్రయత్నించిన క్షణం, అది అతని శరీరాన్ని చుట్టివేసింది. అతని మెడ చుట్టూ ఉచ్చులా తన తోకను బిగించింది. సుమారు యాభై ఐదు మంది అక్కడ ఉన్నా…. అంత పెద్ద పామును చూసి అతడిని రక్షించడానికి ముందుకు రావడానికి చాలామంది భయపడ్డారు. చివరికి కొంతమంది అతణ్ణి విడిపించడానికి పరుగెత్తారు. కొందరు పాము తలను పట్టుకున్నారు. మరికొందరు దాని తోక లాగడానికి ప్రయత్నించారు.

కానీ కొండచిలువ తన పట్టును మరింత బిగించింది. భువనచంద్రన్ ఊపిరాడక దగ్గుతున్నాడు. అప్పుడు కొండచిలువ తలను ఒక నల్ల వస్త్రం తో కప్పి ఇద్దరు వ్యక్తులు దాని తోకను పట్టుకుని బలంగా లాగడం తో చివరకు, అది తన పట్టును సడలించింది. అక్కడ ఉన్నవారి సమయానుకూల స్పందనతో భువనచంద్రన్ ప్రాణాలతో బయటపడ్డాడు. పామును ఒక సంచిలో వేసి అటవీ అధికారులకు అప్పగించారు.

ఇంతలో, భువనచంద్రన్ మెడ నొప్పిగా ఉందని చెప్పడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్సచేసిన సర్వాత అతడిని డిశ్చార్జ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News