కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య... డీసీపీ వివరణ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది. సీఎం సెక్యూరిటీలో పని చేయడానికి ఆయన 12వ బెటాలియన్ నుంచి ఇక్కడకు వచ్చాడు. కాగా, ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తన గన్‌తో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌కు తరలించారు. ఆత్మహత్య ఘటనపై సిద్దిపేట అడిషనల్ డీసీపీ […]

Advertisement
Update: 2019-10-16 03:28 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది.

సీఎం సెక్యూరిటీలో పని చేయడానికి ఆయన 12వ బెటాలియన్ నుంచి ఇక్కడకు వచ్చాడు. కాగా, ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తన గన్‌తో కాల్చుకొని చనిపోయాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌కు తరలించారు.

ఆత్మహత్య ఘటనపై సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. నల్గొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా మద్యానికి బానిసగా మారినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం చాలా కాలం సెలవులో ఉన్నారని.. డీ-అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత విధుల్లో చేరినా తిరిగి సెలవుపై వెళ్లిపోయాడని చెప్పారు.

కాగా, వెంకటేశ్వర్లు భార్య సిద్దిపేట సీపీ జోయల్ డేవీస్‌ను కలసి తన భర్తను తిరిగి విధుల్లో చేర్చుకోమని కోరడంతోనే అతడిని తిరిగి తీసుకున్నామని.. గత నెల 29నే విధుల్లో చేరాడని అన్నారు. అయితే ఇవాళ ఉదయం తిరిగి మద్యం సేవించాడని.. ఆ మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News