హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్‌కు ఉద్వాసన..?

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తారని గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అతనిని తప్పించబోతోందని వార్తలు వచ్చాయి. కాని, నల్గొండ ఎంపీ సీటు నుంచి గెలవడమే కాకుండా.. తన భార్యకు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టికెట్ కూడా ఇప్పించుకున్నారు. కాగా, తాజాగా హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కనుక కాంగ్రెస్ ఓటమి చెందిదే అతనికి ఉద్వాసన తప్పదని […]

Advertisement
Update: 2019-10-14 00:57 GMT

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తారని గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అతనిని తప్పించబోతోందని వార్తలు వచ్చాయి. కాని, నల్గొండ ఎంపీ సీటు నుంచి గెలవడమే కాకుండా.. తన భార్యకు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టికెట్ కూడా ఇప్పించుకున్నారు.

కాగా, తాజాగా హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కనుక కాంగ్రెస్ ఓటమి చెందిదే అతనికి ఉద్వాసన తప్పదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 21న ఉపఎన్నిక జరగనుండగా 19 వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలంతా హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పడానికే వాళ్లు అక్కడ కలసి ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు.

మరోవైపు తన పదవికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తన పదవీ కాలం పూర్తికావచ్చిందని.. దీంతో కొత్త అధ్యక్షుడిని అధిష్టానం నియమిస్తుందని ఆయన అంటున్నారు. తన పదవికి, హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక్కడి ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News