అప్పుడు దేశానికి స్వర్ణం తెచ్చాడు.... కానీ ఇప్పుడు ఇలా...

సర్వాన్ సింగ్ 1954 ఆసియా క్రీడల్లో 110 మీటర్ల హర్డిల్స్ లో స్వర్ణం సాధించినప్పుడు దేశం అతడికి నీరాజనం పలికింది. ఆయన రేసును పూర్తి చేయడానికి తీసుకున్న 14.7 సెకన్లు జీవితంలో అత్యంత ఉత్తమమైనవి. ఇది ఆయన మొట్టమొదటి అంతర్జాతీయ ఈవెంట్. తన కెరీర్ ఎంతో ఉత్తేజభరితం గా ఉంటుందని కలలు కనడానికి ఊతమిచ్చిన విజయం అది. కానీ విధి మరో తలచినటు ఆయనకేం తెలుసు? 1970 లో బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూపు సర్వీస్ నుండి రిటైర్ […]

Advertisement
Update: 2019-10-04 00:52 GMT

సర్వాన్ సింగ్ 1954 ఆసియా క్రీడల్లో 110 మీటర్ల హర్డిల్స్ లో స్వర్ణం సాధించినప్పుడు దేశం అతడికి నీరాజనం పలికింది. ఆయన రేసును పూర్తి చేయడానికి తీసుకున్న 14.7 సెకన్లు జీవితంలో అత్యంత ఉత్తమమైనవి. ఇది ఆయన మొట్టమొదటి అంతర్జాతీయ ఈవెంట్. తన కెరీర్ ఎంతో ఉత్తేజభరితం గా ఉంటుందని కలలు కనడానికి ఊతమిచ్చిన విజయం అది.

కానీ విధి మరో తలచినటు ఆయనకేం తెలుసు? 1970 లో బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూపు సర్వీస్ నుండి రిటైర్ అయినప్పుడు ప్రారంభమైన కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంబాలాలో టాక్సీ నడుపుతూ 20 సంవత్సరాలు కుటుంబం, స్నేహితులకు దూరంగా బతికాడు.

70 ఏళ్ళ వయసులో అతనికి చివరికి 1500 రూపాయల పెన్షన్ మంజూరయింది. అది ఒక మనిషి బతకడానికి ఏమాత్రం చాలదు కదా. బతకడానికి కూలీ అవతారమెత్తాడు. పనిదొరకనప్పుడు బిక్షాటన చేస్తున్నాడు.

చివరికి సర్వాన్ సింగ్ తన గోల్డ్ మెడల్ ని కూడా అమ్ముకోవలసి వచ్చింది. దీన్ని బట్టి ఆయన స్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన వయసు 90 ఏళ్లు. జీవశ్చవం లా ఉన్నాడు. ఒకప్పుడు ఆయనను చూసి గర్వించిన దేశం ఇప్పుడు పూర్తిగా మరచిపోయింది.

ఇలా మరచిపోయిన అథ్లెట్ల లో ఈయనొక్కడే లేడు. కానీ భారత చరిత్ర పుటలలో… అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ గా, అవసాన దశలో ఒక బిచ్చగాడుగా, దిక్కులేనివాడిగా బతుకుతున్న అరుదయిన స్థానం మాత్రం ఈయనదే అని చెప్పవచ్చు. ఇప్పుడు పతకాలు గెలిచినవారికి ఇస్తున్న బహుమతులు, ప్రోత్సాహకాలు అప్పట్లో లేవు. మరి ఇప్పుడైనా వెటరన్లను, గౌరవించి, వారిని ఆదుకునే క్రీడా విధానాన్ని రూపొందించాలి కదా. అదే జరిగితే ఇలాంటి విషాదకర జీవితాన్ని గడపవలసిన అగత్యం సర్వాన్ సింగ్ లాంటి వారికి ఉండేది కాదు.

Tags:    
Advertisement

Similar News